IndiGo pilot
-
పైలట్ నోట జై శ్రీరాం
న్యూఢిల్లీ: అయోధ్యలో శనివారం మొదలైన ఎయిర్‌పోర్ట్‌కు ఢిల్లీ నుంచి తొలి విమానం బయల్దేరి వెళ్లింది. ఇండిగో విమానయాన సంస్థ తమ తొలి ఢిల్లీ–అయోధ్య విమానాన్ని శనివారం మధ్యాహ్నం ప్రారంభించింది. ఈ విమానంలోకి అడుగుపెడుతున్న ప్రయాణికులకు పైలట్ అశుతోష్ శేఖర్ .. ‘జై శ్రీరామ్’ అంటూ స్వాగతం పలికారు. ‘అయోధ్యకు బయల్దేరుతున్న తొలి విమానానికి సారథ్యం వహించే బాధ్యతలు నాకు అప్పగించడం నిజంగా నా అదృష్టం. మీ ప్రయాణం సాఫీగా, ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్’ అని ఆయన విమానంలో అనౌన్స్ చేశారు. తమ తమ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ప్రయాణ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. -
‘నేను మీ పని మనిషిని కాను సార్’.. ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసలు
ప్రముఖ ఏవీయేషన్ సంస్థ ఇండిగో సిబ్బంది, విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. ఈ వివాదంలో మరో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎయిర్ హోస్టెస్‌కు సపోర్ట్ చేశారు. నెటిజన్లు సైతం ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండిగో సంస్థ ఇస్తాంబుల్- ఢిల్లీ విమానాల కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. డిసెంబర్ 16న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడు తానుకోరుకున్న ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో లేవని వాగ్వాదానికి దిగాడు. ఫ్లైట్‌లో ఉన్న ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఈ ఆర్.గూర్ప్రీత్ సింగ్ మెన్స్ వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది తెగ చక్కెర్లు కొడుతోంది. వాళ్లూ మనుషులే As I had said earlier, crew are human too. It must have taken a lot to get her to breaking point. Over the years I have seen crew slapped and abused on board flights, called "servant" and worse. Hope she is fine despite the pressure she must be under. https://t.co/cSPI0jQBZl — Sanjiv Kapoor (@TheSanjivKapoor) December 21, 2022 ఈ తరుణంలో ఫ్లైట్‌లో ప్రయాణికులు-ఎయిర్ హోస్టెస్ మధ్య జరిగిన ఘర్షణపై జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందించారు. ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కు మద్దతు పలికారు. సిబ్బంది కూడా మనుషులేనని వ్యాఖ్యానించారు. ‘నేను ముందే చెప్పినట్లు,సిబ్బంది కూడా మనుషులే.నేను గత కొన్నేళ్లుగా విమానంలో సిబ్బందిని..చెంపదెబ్బలు కొట్టడం దూర్భాషలాడడం చూశాను. ప్రయాణికుడితో జరిగిన వాగ్వాదంలో ఆమె తీవ్రంగా త్తిడికి గురైంది. ఇప్పుడు ఆమె బాగుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఎయిర్ హోస్టెస్‌కు అండగా నెటిజన్లు సీఈవో వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందించారు.హెచ్ఆర్, యాజమాన్యం మహిళా సిబ్బందికి అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. వారు ఈ స్థాయిలో చేరేందుకు ఎంతో కష్టపడిందో అర్ధం చేసుకోవాలంటూ అండగా నిలుస్తున్నారు. ఈ ఘటనలో మహిళా సిబ్బంది తప్పు లేదని, ఎంతో ఓర్పుతో సమాధానం ఇచ్చిందని ప్రశంసిస్తున్నారు. ఫ్లైట్‌లో ఏం జరిగింది ఇండిగోకు విమానం ‘6ఈ 12’ ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ వైపు వస్తుంది. ప్రయాణ సమయంలో ఎయిర్ హోస్టెస్‌కు, ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికుడు దురుసగా ప్రవర్తించడంతో ఓ ఎయిర్ హోస్ట్ కన్నీటి పర్యంతమైంది. దీంతో మరో ఎయిర్ హోస్టెస్ వారికి సర్ది చెప్పి గొడవను సద్దుమణిగించేందుకు వెళ్లింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రయాణికుడు మరింత రెచ్చిపోయాడు. గొడవను సద్దుమణించేందుకు ప్రయత్నించిన సదరు మహిళా ఉద్యోగిని వైపు చేత్తో సంజ్ఞలు చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె ప్రయాణికుడికి గట్టిగా సమాధానం ఇచ్చింది. Tempers soaring even mid-air: "I am not your servant" An @IndiGo6E crew and a passenger on an Istanbul flight to Delhi (a route which is being expanded soon with bigger planes in alliance with @TurkishAirlines ) on 16th December : pic.twitter.com/ZgaYcJ7vGv — Tarun Shukla (@shukla_tarun) December 21, 2022 "నువ్వు నా వైపు వేలు చూపుతూ ఎందుకు అరుస్తున్నావు. నీ వల్ల నా సిబ్బంది ఏడుస్తున్నారు. దయచేసి పరిస్థితని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరిపడ భోజనాలు (విమానంలో) ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆహారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం’ అని మాట్లాడుతుండగా ప్రయాణికుడు అడ్డు తగిలాడు "ఎందుకు అరుస్తున్నావు?" అని ప్రయాణికుడు గట్టిగా అరిచాడు. ఎయిర్ హోస్ట్ తన స్వరం పెంచుతూ...ఎందుకంటే మీరు మా మీద అరుస్తున్నారు. నీ మీ పని మనిషిని కాదు సార్. ఎయిర్ హెస్ట్ని. ఇండిగో సంస్థ ఉద్యోగిని అంటూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. శాండ్ విచ్ లేదని.. ఫ్లైట్ వివాదంపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. ప్రయాణీకుడు శాండ్విచ్ అడిగారని, విమానంలో ఫుడ్ ఐటమ్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేస్తామని సిబ్బంది చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌పై అరవడం ప్రారంభించాడు. దీంతో భయాందోళనకు గురైన ఎయిర్ హోస్ట్ ఏడ్చినట్లు తెలిపింది. -
Aafrin Hirani: ఆదిలాబాద్ అమ్మాయికి రెక్కలొచ్చాయి
అవును. ఇండిగో రంగు రెక్కలు. ఆకాశంలో దూసుకువెళ్లే రెక్కలు. ఆ రెక్కలు ఇకపై ఎందరినో గమ్యానికి చేర్చనున్నాయి. ఆదిలాబాద్ నుంచి మొదటి మహిళా పైలెట్ అయిన స్వాతి రావు స్ఫూర్తితో అదే అదిలాబాద్ జిల్లా నుంచి రెండో పైలెట్ అయ్యింది ఆఫ్రిన్ హిరానీ. ఇంద్రవెల్లిలో డిపార్ట్మెంటల్ స్టోర్ నడిపే ఆమె తండ్రి ఆఫ్రిన్‌కు ఆపాయింట్మెంట్ లెటర్ రావడంతోటే తన దగ్గర పని చేసే 15 మంది గిరిజన ఉద్యోగులను విమానం ఎక్కించి తిరుపతి తీసుకెళ్లడం విశేషం. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను విమానంలో తీసుకెళ్తున్న ఆఫ్రీన్ తండ్రి ఆఫ్రిన్ హిరానీకి కొంత దారి ముందే పడింది.ఆ దారి వేసింది అదే జిల్లా నుంచి మొదటిసారి కమర్షియల్ పైలెట్ అయిన స్వాతి రావు. 2005లో స్వాతి రావు కమర్షియల్ పైలెట్ అవ్వాలని అనుకున్నప్పుడు వెనుకబడిన జిల్లా కావడం వల్ల ఆమెకు ఏ సమాచారం దొరకలేదు. ఇంటర్నెట్ లేదు. కోర్సు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. తండ్రికి కూడా పెద్దగా వివరాలు తెలియలేదు. కాని అదే సమయంలో ఆమె తమ్ముడు బిట్స్ పిలానిలో చేరడంతో అక్కడి నుంచే వివరాలు తెలుసుకుని అక్కకు చెప్పాడు. దాంతో స్వాతి రావు మొదట హైదరాబాద్‌లో చదివి ఆ తర్వాత ఫిలిప్పైన్స్ వెళ్లి ‘కమర్షియల్ పైలెట్ లైసెన్స్’ (సి.పి.ఎల్) చేసింది. ఇండియా తిరిగొచ్చి పైలెట్ అయ్యింది. ‘నేను పైలెట్ అవ్వాలనుకున్నప్పుడు ఆమె నుంచే స్ఫూర్తి పొందాను’ అంది ఆఫ్రిన్ హిరానీ. ‘మా జిల్లా నుంచి ఆమె పైలెట్ అయినప్పుడు నేనెందుకు కాకూడదు అని గట్టిగా అనుకున్నాను’ అంటుంది ఆఫ్రిన్. 28 ఏళ్ల ఆఫ్రిన్ ఇప్పుడు ఇండిగో పైలెట్. మనం ఏ చెన్నైకో, ఢిల్లీకో ఇండిగోలో వెళుతున్నప్పుడు మనం ఎక్కిన ఫ్లయిట్‌ను ఆఫ్రిన్ నడపవచ్చు. ‘నేను మీ పైలెట్ ఆఫ్రిన్‌ని’ అని మైక్రోఫోన్లో మనకు గొంతు వినిపించవచ్చు. ఆదిలాబాద్ జిల్లా నుంచే మరో అమ్మాయి పైలెట్ కావడం అంటే చిన్న విషయం కాదు. చిల్లర అంగడి నుంచి నింగికి ఆఫ్రిన్ తండ్రి అజిజ్ హిరానీకి ఇంద్రవెల్లిలో పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది. అతను స్కూల్ చదువు మాత్రమే చదువుకున్నాడు. భార్య నవీన హిరాని గృహిణి. వారి కుమార్తె ఆఫ్రిన్ పైలెట్ కావాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెకు మద్దతు పలికారు. ‘నా కూతురికి ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇవ్వాలనుకున్నాను’ అంటాడు అజిజ్. అతను ఇంద్రవెల్లిలోని గిరిజనేతర పిల్లలతో పాటు గిరిజన పిల్లలకు కూడా సమాన చదువు అందాలని ‘ఇంద్రవెల్లి పబ్లిక్ స్కూల్’ పేరుతో ఒక స్కూల్ కూడా నడుపుతున్నాడు. ఆఫ్రిన్ తన ప్రాథమిక విద్యను అక్కడే చదివింది. హైదరాబాద్‌లో ఇంటర్ చేసి మల్లారెడ్డి కాలేజ్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో రెండళ్ల ఫ్లయింగ్ కోర్సు చేసింది. 2020 సంవత్సరం నాటికి పూర్తి యోగ్యతతో ఆమె ఇండియా తిరిగి వచ్చింది. అయితే కోవిడ్ వల్ల ఆమె అపాయింట్మెంట్ ఆలస్యమైంది. ఇటీవలే ఇండిగోలో జాయిన్ అయ్యింది. ‘ఎప్పుడెప్పుడు నా దేశంలో విమానం ఎగరేద్దామా అన్న నా కోరిక ఇన్నాళ్లకు తీరింది’ అంటుంది ఆఫ్రిన్. మత సామరస్యం ఆఫ్రిన్‌కు పైలెట్‌గా అపాయింట్మెంట్ రాగానే ఆమె తల్లిదండ్రులతో పాటు స్టోర్‌లో పని చేసే సిబ్బంది కూడా ఆనందించారు. వారంతా చుట్టుపక్కల పల్లెలకు చెందినవారు. చిరు సంపాదనాపరులు. ఆఫ్రిన్ తండ్రి వారి కోసమని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వెంట ఉండి మరీ అందరినీ మొదటిసారి హైదరాబాద్ నుంచి విమానంలో తిరుమల యాత్రకు తీసుకెళ్లాడు. జీవితంలో మొదటిసారి విమానం ఎక్కినందుకు వారు ఆనందించారు. ఆఫ్రిన్ అంతటి విమానాన్ని నడపబోతుందా అని ఆశ్చర్యపోయారు. ఏమో... రేపు ఈ సిబ్బంది పిల్లల నుంచి మరో స్వాతి, మరో ఆఫ్రిన్ రావచ్చు. ఆడపిల్లలను స్కూల్ మాన్పించడం, చిన్న వయసులో వివాహం చేయడం వంటివి మానుకుని వారికి తగిన సపోర్ట్ ఇస్తే ఆకాశమే హద్దు. -
Indigo Flight Emergency Landing:పైలటే ప్రాణాలు కాపాడారు..
శంషాబాద్(హైదరాబాద్): షార్జా నుంచి హైదరాబాద్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ–1406 విమానంలో బయల్దేరిన తమను పైలటే కాపాడారని ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శనివారం రాత్రి 10.50 గంటలకు బయల్దేరిన విమానం షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం తెల్లవారు జామున 4:10 గంటలకు చేరుకో వాల్సి ఉండగా విమానంలోని సాంకేతికలోపాన్ని గుర్తించిన పైలట్ పాకిస్తాన్‌లోని కరాచి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. తెల్లవారు జామున విమానాన్ని కరాచి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసిన అనంతరమే విమానంలో సాంకేతికలోపం తలెత్తిందన్న సమాచారాన్ని ఎయిర్‌లైన్స్ వెల్లడించిందని ప్రయాణికులు తెలిపారు. ఎనిమిది గంటల పాటు విమానంలోనే ఉన్న తర్వాత భోజన ఏర్పాట్లు చేశా రని వెల్లడించారు. తొలుత కరాచి నుంచి ప్రయాణికులను గుజరాత్‌లోని అహ్మదాబాద్ మీదుగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ ప్రయత్నాన్ని రద్దు చేశారు. ప్రత్యేక విమానంలో కరాచి నుంచి నేరుగా శంషాబాద్‌కు తీసుకొచ్చారు. పైలట్ సాంకేతిక లోపం గుర్తించడంతోనే తాము ప్రాణాలతో బయటపడ్డామని, కరాచిలో విమానం ల్యాండయ్యాక మాత్రమే తమకు వివరాలు వెల్లడించారని ప్రయాణికులు తెలిపారు. కరాచి విమానాశ్రయంలో విమానం ల్యాండ్ చేశాక, సుమా రు ఎనిమిది గంటలకు పైగా విమానంలోనే ఉన్నాం. పైలట్ గుర్తించకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. – ఓ ప్రయాణికుడు -
షార్జా నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానం.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
కరాచీ: షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. విమానంలోని ప్రయాణికులందరినీ మరో విమానంలో తరలించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసింది. 'షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం 6E-1406ను కరాచీ వైపు మళ్లించాం. సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించి పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తాం.' అని ఇండిగో ప్రకటనలో తెలిపింది. రెండు వారాల వ్యవధిలోనే భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ కావడం గమనార్హం. జులై5న న్యూఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం కూడా సాంకేతిక సమస్య వల్ల కరాచీలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కొన్ని గంటల పాటు అక్కడే ఉంది. -
పైలట్ రోహిత్‌కు కునాల్ కృతజ్ఞతలు
ఇండిగో ప్రైవేటు ఎయిర్‌లైన్ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పైలట్ రోహిత్‌కు కమెడియన్ కునాల్ కామ్రా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 28న ఇండిగో సంస్థ విమానంలో ప్రయాణించిన కునాల్ అదే విమానంలో వెళ్లున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామిని అసభ్యకరంగా మాట్లాడినందుకు కునాల్‌పై నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఆరు నెలలపాటు కామ్రా తమ విమానాల్లో ప్రయాణించరాదని ఇండిగో విమానయాన సంస్థ వేటు వేసింది. మిగతా విమాన సర్వీసుల కూడా కునాల్ కామ్రపై నిషేధం విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పిలుపునిచ్చారు. (ప్రముఖ కమెడియన్‌పై నిషేధం) ఈ క్రమంలో సదరు విమాన పైలట్ రోహిత్ మాటేటి ఇండిగో విమాన సంస్థకు ఓ లేఖ రాశారు. అందులో ‘కేవలం సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఇండిగో విమానయాన సంస్థ పనిచేసింది. ప్రయాణికుడిపై చర్యలు తీసుకునే ముందు పైలట్ ఇన్ కమాండర్‌ను సంప్రదించలేదు. విమాన సిబ్బంది చెప్పిన సూచనలను కునాల్ పాటించాడు. ఈ చర్యకు చాలా సార్లు క్షమాపణలు కూడా కోరాడు. కామ్రా విమానంలో కొంత విసుగు కలిగించే విధంగా ప్రవర్తించవచ్చు. కానీ అతన్ని బ్యాన్ చేసే అంత అసభ్యకరంగా ప్రవర్తించలేదు’ అంటూ కమెడియన్‌కు మద్దతుగా లేఖలో పేర్కొన్నారు. తన 9 సంవత్సరాల అనుభవంలో ఇలాంటి ఘటన జరగలేదని పైలట్ తెలిపారు. (అర్నాబ్‌పై ఆగ్రహం, కునాల్‌కు షాక్) Captain Rohit Mateti ko mera salaam 🙏🙏🙏 — Kunal Kamra (@kunalkamra88) January 31, 2020 కాగా దీనిపై స్పందించిన కమెడియన్ కునాల్..‘నేను కెప్టెన్ రోహిత్ మాటేటికి నమస్కారం చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఇక పైలట్ లేఖ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించి.. ఈ సంఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని, ఇందుకు అంతర్గత కమిటీ దర్యాప్తును ప్రారంభించిందని ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఇండిగో పైలట్లను సస్పెండ్ చేసిన డీజీసీఏ
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) హెచ్చరికను పట్టించుకోకుండా విమానాన్ని నడిపినందుకు ఇద్దరు ఇండిగో పైలట్లను డీజీసీఏ సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇండిగో విమానం టేల్ ప్రాప్(విమానం ల్యాండ్ అయిన సమయంలో దానికి సపోర్టింగ్‌గా వెనుక భాగంలో ఉంచే స్టాండ్)తో అలానే టేకాఫ్ అయింది. విమానంలో గాల్లోకి లేచే సమయంలో టేల్ ప్రాప్ కిందకు వేలాడకూడదు. అయితే దీనిని గమనించిన ఏటీసీ అధికారులు విమానంలోని ఇద్దరు పైలట్లకు ఈ సమాచారం చేరవేశారు. అయితే వారు విమానాన్ని తిరిగి హైదరబాద్‌కు మళ్లించకుండా విజయవాడకు వెళ్లారు. జూలై 24న చోటుచేసుకున్న ఈ ఘటనపై విచారణ చేపట్టిన డీజీసీఏ ఆ విమానం నడుపుతున్న ఇద్దరు పైలట్లను సస్పెండ్ చేసింది. ఈ విధంగా టేల్ ప్రాప్ తో ప్రమాణం ప్రమాదకరమని డీజీసీఏ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి సదరు పైలట్లకు షో కాజ్ నోటీసులు జారీ చేయగా.. వారు తమ తప్పును అంగీకరించారు. -
ఇండిగో సమ్మర్ ఆఫర్ సేల్
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో... రూ.999కే టికెట్ అందిస్తోంది. ‘3–డే సమ్మర్ సేల్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్.. మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఉండనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్ వర్తిస్తుంది. ఢిల్లీ–అహ్మదాబాద్, ముంబై–హైదరాబాద్, హైదరాబాద్–దుబాయ్, చెన్నై– కువైట్, ఢిల్లీ–కౌలాలంపూర్, బెంగళూరు–మాల్దీవ్ రూట్లలో ఆఫర్ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘వేసవి సెలవులు మొదలవడంతో ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభించాం. మే16 వరకు జరిగే బుకింగ్స్‌పై ఆఫర్ వర్తిస్తుంది’ అని సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విలియం బౌల్టర్ పేర్కొన్నారు. ప్రీ–పెయిడ్ అధిక బ్యాగేజీపై 30% వరకు డిస్కౌంట్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
అడ్డంగా దొరికేసిన ఇండిగో పైలట్
విమానాలు ఆలస్యం కావడం ఆరుదు. అలా లేటైనప్పుడు అందుకు కారణం ఏంటని ప్రయాణికులు గట్టిగానే నిలదీస్తారు. అలాగే ప్రయాణికులు నిలదీస్తుంటే.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి ఇవ్వలేదని వంక చెప్పేందుకు ప్రయత్నించిన ఇండిగో విమాన పైలట్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఏటీసీ తప్పు ఏమీ లేకపోయినా.. దానిమీదకు తోసేయడంపై ఇండిగో విమానయాన సంస్థను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయొద్దని స్పష్టం చేసింది. దాంతో ఇండిగో సంస్థ తన పైలట్లందరికీ ఓ ఈమెయిల్ పంపింది. ఇలాంటి పనులకు పాల్పడొద్దని అందులో గట్టిగానే చెప్పింది. చెన్నై నుంచి మదురై మార్గంలో వెళ్లాల్సిన 6ఇ-859 విమానం 11.45కి బయల్దేరాల్సి ఉండగా, దాన్ని 12.25కి రీషెడ్యూల్ చేశారు. ఆ విషయమై ప్రయాణికులకు ఎస్ఎంఎస్లు పంపారు. విమాన డిపార్చర్‌కు ఏటీసీ నుంచి అనుమతి రాలేదని పైలట్ తెలిపాడు. అయితే.. ప్రయాణికుల్లో ఒక ఏటీసీ అధికారి కూడా ఉన్న విషయం సదరు పైలట్‌కు తెలియదు. ఆయన వెంటనే చెన్నై ఏటీసీకి ఫోన్ చేసి విషయం ఏంటని అడిగారు. కానీ, వాళ్లు అసలు తమవైపు నుంచి సమస్య ఏమీ లేదని చెప్పడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. పైలట్ ఆ విషయం చెప్పే సమయానికి కాక్‌పిట్‌లో కో పైలట్ కూడా లేరు. ఆ తర్వాత తాను చెప్పిన అబద్ధానికి సదరు పైలట్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కో పైలట్ రాకపోవడం వల్లే విమానం ఆలస్యం అయ్యిందని తెలిపారు. అయితే.. తమ విమానం కేవలం మూడు నిమిషాలే ఆలస్యం అయ్యిందని ఇండిగో తెలిపింది.