వ్యవసాయం చేసే రైతులు ఎలా ఉంటారో మనకు తెలుసు. అది మగవాళ్లైనా, మహిళలైన వ్యవసాయం చేస్తే వాళ్లు చూడటానికి కష్టజీవుల్లా కనిపిస్తారు. వ్యవసాయం మాటలు కాదు. చెమటోడ్చి కష్టపడినా పంట పండుతుందని చెప్పలేం, ఒకవేళ పండినా గిట్టుబాటు ధర లేదంటే.. చేతికొస్తుందనేది కూడా డౌటే. అలాంటి వ్యవసాయాన్ని సునాయాసంగా చేస్తూ స్టైయిలిష్‌గా ఫోటోలు తీసుకుంటుంది. పైగా ఆమె చూడటానికి చాలా స్టైలిష్ లుక్‌లో ఉండే మోడల్‌లా కనిపిస్తుంది. అంతేగాదు ఆమెను చూస్తే ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా! అని షాకవ్వుతారు!.
వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్‌కి చెందిన 29 ఏళ్ల బ్రిట్నీ వుడ్స్ అనే మహిళ వ్యవసాయం చేస్తోంది. నిజానికి ఎంత చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేసిన వెంటనే ఆహర్యం మారిపోతుంది. ఎందుకంటే మట్టిలో చేసేపని కాబట్టి అందుకుతగ్గా వస్త్రాధారణ లేకపోతే వర్క్‌అవుట్ అవ్వద్దు. కానీ ఈ మహిళ మోడ్రన్ దుస్తుల్లోనే వ్యవసాయం చేస్తూ ఆకర్షిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఆమె స్వయంగా ఆవుల్ని గేదెల్ని మేపుతుంది, పాలు పితుకుతుంది కూడా. అలాగే వ్యవసాయం పనుల్లో విత్తనాలు విత్తడం దగ్గర నుంచి ట్రాక్టర్ నడపడం వరకు అన్ని ఆమే చేస్తుంది. అందుకోసం తన శైలిని మార్చుకోలేదు.
ఆధునిక అమ్మాయి మాదిరిగా డ్రస్సింగ్ స్టైల్‌లోనే వ్యవసాయం చేస్తూ ప్రేరణ ఇస్తుంది. తాను ఆవుల్ని,గేదెల్ని మేపుతున్న ఫోటోలను, వ్యవసాయం చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది. ఆ ఫోటోలకు అచ్చం మోడలింగ్ చేసే గర్ల్‌లా డ్రస్‌లు వేసుకుని ఫోజులిస్తుంది. పైగా ఆన్‌లైన్‌లో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా ఇచ్చేస్తోంది. మరోవైపు ఆన్‌లైన్‌లో కంటంట్ క్రియటర్‌గా డబ్బులు కూడా సంపాదిస్తోంది.
వ్యవసాయం చేయడాన్ని ఇలా మోడలింగ్‌గా కూడా వాడుకోవచ్చా అనేలా వెరైటీగా వ్యవసాయం చేస్తోంది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలకు ప్రజలు అట్రాక్ట్ అవ్వడమే గాక ఇలా కూడా వ్యవసాయం చెయ్యొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రాంలోనూ టిక్‌టాక్‌లోనూ వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇక బ్రిట్నీ హైస్కూల్ విద్య పూర్తి అయ్యిన వెంటనే బిజినెస్‌లో డిగ్రీ చేసింది. ఆ తర్వాత అటువైపుకి వెళ్లి ఉద్యోగం చేసే ఆసక్తి లేకపోవడంతో వ్యవసాయం చెయ్యాలని గట్టిగా డిసైడ్ అయిపోయింది.
ఏదో ఒకరోజుకు తాను సొంతంగా పొలాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. అయితే బ్రిట్నీ అందరిలా మాములు దుస్తులు కాకుండా ట్రెండీ దుస్తులు వేసుకుంటూనే వ్యవసాయం చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. మోడల్ మాదిరిగా దుస్తులు ధరించి, హుందాగా చెయ్యొచ్చు అనే ట్రెండ్ సెట్ చేసింది బ్రిట్నీ. అంతేగాదు నెటిజన్లు ఆమెను మోడల్ రైతుగా పిలుస్తారు. ఈ వ్యవసాయం కూడా పురుషాధిక్య ప్రపంచం కావడంతో ఆమె పలు విమర్శలు ఎదుర్కొనక తప్పలేదు.
ముఖ్యంగా ఆమె అలా మోడ్రన్ దుస్తులు ధరించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శులు వస్తున్నాయని బ్రిట్నీ చెబుతోంది. అయితే వాటిని తాను పట్టించుకోనని, తన లక్ష్యం వైపుగానే సాగిపోతానని ధీమాగా చెబుతోంది. అదేసయంలో తనకు తోటి పురుష రైతుల నుంచి కొంత మద్దతు కూడా లభించడం విశేషం. అయితే ఎవ్వరూ ఎన్ని కామెంట్లు చేసినా సంప్రదాయ దుస్తుల్లో వ్యవసాయం చేసేది లేదని తేగేసి చెబుతుంది. బ్రిట్నీ తాను కొన్నిసార్లు అన్నింటినీ వదులుకుని పూర్తి సమయం వ్యవసాయం చేయడానికే కేటాయిస్తాను, అయితే డబ్బు సంపాదించడానికి కంటెంట్‌ను కూడా సృష్టిస్తున్నాని చెప్పుకొచ్చింది. ఐతే పొలం పనుల్లో ఆమెకు సహాయం చేసే మగవాళ్లు కూడా ఆమె పనిని చూసి మెచ్చుకుంటారట.
(చదవండి: ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..)
Comments
Please login to add a commentAdd a comment