
ఢాకా: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ కరోనా బారిన పడ్డాడు. ఇది సాధారణ విషయమే!.. విచిత్రమేమింటంటే ఫిన్ అలెన్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకింది. బంగ్లాదేశ్ పర్యటన కోసం ఢాకా వచ్చిన అతనికి జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కరోన పరీక్ష చేయగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అతన్ని బస చేసిన హోటల్‌లోనే క్వారంటైన్ చేసినట్లు కివీస్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఫిన్ అలెన్ న్యూజిలాండ్ తరపున 3 టీ20 మ్యాచ్‌లాడి 88 పరుగులు చేశాడు. ఇక ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 1 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
చదవండి: WI Vs PAK: 10 వికెట్లతో దుమ్మురేపిన షాహిన్ ఆఫ్రిది; పాకిస్తాన్ ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment