
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ తౌఫిక్ ఉమర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. శనివారం రాత్రి కాస్త అస్వస్థతగా ఉండటంతో ఉమర్ కోవిడ్–19 పరీక్ష చేయించుకున్నాడు. పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చిందని... అయితే తనలో కరోనా లక్షణాలు తీవ్రంగా ఏమీ లేవని... ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని ఉమర్ వివరించాడు. 38 ఏళ్ల ఉమర్ పాకిస్తాన్ తరఫున 44 టెస్టులు ఆడి 2,963 పరుగులు... 12 వన్డేలు ఆడి 504 పరుగులు సాధించాడు. కోవిడ్–19 బారిన పడ్డ నాలుగో క్రికెటర్ ఉమర్. గతంలో మాజిద్ హక్ (స్కాట్లాండ్), జఫర్ సర్ఫరాజ్ (పాకిస్తాన్), సోలో ఎన్‌క్వెని (దక్షిణాఫ్రికా)లకు కరోనా సోకింది.