పార్లమెంట్‌లో ఒక మహిళా రాజకీయవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచేలా శక్తిమంతంగా తన గళం వినిపించింది. అదికూడా స్థానిక భాషల కోసం పార్లమెంట్‌లో చాలా ఉద్వేగభరితంగా మాట్లాడటం సంచలనంగా మారింది. చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికవ్వడమే గాక మాతృ భాషలో పార్లమెంటే దద్దరిల్లేలా మాట్లాడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె? దేని గురించి అంతలా శివంగిలా మాట్లాడింది.
ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసకుంది. ఆక్లాండ్, హామిల్టన్ మధ్య ఉన్న హంట్లీ అనే చిన్న పట్టణానికి చెందిన ఆమె పేరు హనా-రౌహితీ మైపి-క్లార్క్. కేవలం 21 ఏళ్ల వయసులోనే పార్లమెంట్‌కి ఎన్నికై రికార్డు సృష్టించింది. ఏకంగా 170 ఏళ్ల న్యూజిలాండ్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీగా నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో పార్లమెంట్‌కి ఎన్నికయ్యారు. ఆమె న్యూజిలాండ్‌లోని మావోరి కమ్యూనిటీల హక్కుల కోసం పోరాడుతున్నారు. అంతేగాదు ఆ మావోరిల కమ్యునిటీ గార్డెన్‌ను కూడా మైపీ క్లార్క్ నడుపుతోంది
ఏం మాట్లాడారంటే..
ఆ ఉద్వేగభరిత ప్రసంగంలో..తాను ఓటర్లకు "మీ కోసమే బతుకుతాను", "మీ గురించే చనిపోతానని" వాగ్దానం చేశాను. మా మావోరి తెగ తరతరాలుగా చాలా వెనుకబడి ఉంది. వారంతా తమ మాతృభాష నేర్చుకోవడం కోసం ఆర్రులు చాచి చూస్తోన్నారు. కనీసం తమ గుర్తింపుని కూడా చెప్పుకోలేని దీన స్థితిలో ఉంది. ఇప్పటికీ తాము వెనకబడిపోయే ఉన్నాం. అంతేగాదు నన్ను నేను ఎప్పటికీ రాజకీయ నాయకురాలి చూడనని. కేవలం మావోరి భాష సంరక్షకురాలిగా భావిస్తాను ఎందుకంటే రాబోయే తరాలకు ఈ స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
నిజానికి ఈ పార్లమెంట్‌లో ప్రవేశించే ముందు కొన్ని సలహాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా దేన్ని తీసుకోకూడదన్నారు. కానీ నేను ఈ ఛాంబర్‌లో చెప్పిన ప్రతిదాన్ని వ్యక్తిగతం తీసుకోకుండా ఉండలేను. జస్ట్ రెండు వారాల్లో ఈ ప్రభుత్వం నా ప్రపంచం(మావోరి) మొత్తంపై దాడి చేసింది. ఎంతలా అంటే ఆరోగ్యం, పర్యావరణం, నీరు, వెన్యువా, సహజవనరులు, మావోరి వార్డులు, వారి భాష, ఉనికి అన్నింటిని లాగేసుకుంది. ఈ దేశంలో మాకైనా, మీకైనా ఒక దేశ పౌరులుగా అన్ని హక్కులను సద్వినియోగించుకునే హక్కు ఉంది కదా! అంటూ తన మాతృ భాషలో పార్లమెంట్‌ని గడగడలాడించేలా మాట్లాడింది. దీంతో ఆమె ప్రసంగం వీడియో ఓ సంచలనంగా మారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, ఆమె తాతా తైతిము మైపి కూడా మావోరి కార్యకర్తే.
New Zealand natives' speech in parliament pic.twitter.com/OkmYNm58Ke
— Enez Özen | Enezator (@Enezator) January 4, 2024
(చదవండి: మహిళా భద్రతలో టాప్.... చెన్నై!! హైదరాబాద్ స్థానం...??)
Comments
Please login to add a commentAdd a comment