T20 World Cup 2021: Gary Stead Updated On Kane Williamson Hamstring Twinge Injury - Sakshi
Sakshi News home page

Kane Williamson: టీ20 ప్రపంచకప్‌ ముందు కెప్టెన్‌కు గాయం..!

Published Wed, Oct 13 2021 12:42 PM | Last Updated on Wed, Oct 13 2021 1:53 PM

T20 World Cup 2021: Gary Stead gives an update on Kane Williamson injury - Sakshi

Gary Stead Gives An Update On Kane Williamson Injury: టీ20 వరల్డ్‌కప్‌-2021కు ముందు  న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు ఆ జట్టు హెడ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్ వెల్లడించాడు. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం వహిస్తున్న విలియమ్సన్  తమ చివరి లీగ్ మ్యాచ్‌కు అందుకే దూరమయ్యాడని అతడు తెలిపాడు. 'కేన్ ప్రస్తుతం బాగున్నాడు. అతడు మోకాలి గాయంతో భాదపడతున్నాడు. అయితే, ప్రస్తుతం అన్ని పనుల్నీ చేయగల్గుతున్నాడు. విలియమ్సన్ నెమ్మదిగా గాయం నుంచి కోలుకుంటున్నాడు'  గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు.

కాగా 6 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని మంగళవారం తమ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మొదలు పెట్టారని గ్యారీ స్టెడ్ చెప్పారు. యూఏఈలో వాతావరణ  పరిస్థితులు చాలా వేడిగా ఉన్నాయని.. ముందే తమ జట్టు అన్ని విధాల సంసిద్ధమయ్యే ఫ్లూయిడ్స్‌ను తమతో తీసుకెళ్లిందని స్టెడ్ వెల్లడించాడు. కాగా కీవిస్‌  టీ20 ప్రపంచకప్‌లో తమ మొదటి మ్యాచ్  అక్టోబర్ 26న పాకిస్తాన్‌తో ఆడనుంది.

చదవండి: Virat Kohli: 'నీకు సోదరిగా పుట్టినందుకు గర్విస్తున్నా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement