
New Zealand vs Sri Lanka, 1st Test క్రైస్ట్‌చర్చి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండో సెషన్ సమయానికి 18 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 373 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను డారిల్ మిచెల్ 102 పరుగులతో వీరోచిత శతకంతో నిలబెట్టాడు. అనంతరం లోయర్ ఆర్డర్‌లో మాట్ హెన్రీ (72 పరుగులు) టెయింలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి కివీస్ ఆధిక్యం సాధించడంలో ముఖ్యపాత్ర వహించాడు.
అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న లంక మూడో రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ 20, ప్రభాత్ జయసూర్య రెండు పరుగులతో ఆడుతున్నారు. శనివారం నాటి ముగిసే సరికి లంక 65 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడటం టీమిండియాకు కాస్త ఊరటనిచ్చే అంశం.
ఒకవేళ కివీస్, లంక మ్యాచ్ డ్రాగా ముగిసినా.. లేక లంక రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకు పరిమితమై కివీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉంచి.. వారి చేతిలో ఓడిపోయినా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టేది టీమిండియానే. అప్పుడు టీమిండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా సరిపోతుంది.
ఒకవేళ టీమిండియా ఓడిపోతే మాత్రం పరిస్థితి కాస్త క్లిష్టంగా మారుతుంది. అలా జరగకుండా ఉండాలంటే కివీస్, లంక మ్యాచ్ డ్రా అయినా కావాలి లేదా లంక ఓడిపోవాలి. అదే సమయంలో టీమిండియా ఆసీస్‌తో మ్యాచ్‌ను డ్రా లేదంటే గెలవడం చేయాలి.
చదవండి: Virat Kohli: రెండోరోజు ఆట ముగింపు.. కోహ్లి చర్య వైరల్
Comments
Please login to add a commentAdd a comment