న్యూజిలాండ్‌కు చెందిన 26 ఏళ్ల మేఘన్ టేలర్ గుర్రపు పందెంలో ప్రాణాలు కోల్పోయింది. యంగ్ జాకీ రైడర్‌గా పేరు పొందిన మేఘన్ టేలర్ కాంటర్‌బరిలోని యాష్‌బర్టన్ రేస్‌వే వద్ద గురువారం జరిగిన హార్స్ రేసులో పాల్గొంది. రేసు మధ్యలో దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో ఆమె మరణించింది.
రేస్ జరుగుతున్న సమయంలో మరొక జాకీ రైడర్‌తో జరిగిన క్లాష్‌లో మేఘన్ టేలర్ కిందపడిపోయింది. అయితే వేగంగా పరిగెత్తుతున్న గుర్రంపై నుంచి కిందపడడంతో ఆమె తలకు బలమైన గాయం అయింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించేలోపే మేఘన్ టేలర్ ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు మేఘన్ టేలర్ రెడ్ ఆర్కిడ్ హార్స్‌తో రెండో స్థానంలో ఉంది.
అయితే ఆమె వెనకాలే మరో ముగ్గరు జాకీ రైడర్స్ ఒకే పార్శ్వంలో రావడమే ప్రమాదానికి కారణమైంది. మేఘన్‌తో పాటు మిగతా ముగ్గురు కూడా కింద పడినప్పటికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక మేఘన్ టేలర్ జాకీ రైడర్‌గా 2019లో తన కెరీర్‌ను ప్రారంభించింది. యూరోప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత న్యూజిలాండ్‌లో పలుమార్లు హార్స్ రేసింగ్‌లో పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment