అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ మంగళవారం జట్టును ప్రకటింది. 15 మందితో కూడిన జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు. ఫిన్ అలెన్, మైకెల్ బ్రాస్‌వెల్‌లు తొలిసారి టి20 ప్రపంచకప్ ఆడనుండగా.. జట్టు సీనియర్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ రికార్డు స్థాయిలో ఏడోసారి టి20 ప్రపంచకప్ ఆడనున్నాడు.
కివీస్ తరపున నాథన్ మెక్‌కల్లమ్, రాస్ టేలర్‌లు మాత్రమే ఇప్పటివరకు ఆరు టి20 వరల్డ్‌కప్‌లు ఆడారు. తాజాగా గప్టిల్ ఏడో టి20 వరల్డ్‌కప్ ఆడుతూ జట్టు తరపున అత్యధిక వరల్డ్‌కప్‌లు ఆడనున్న తొలి ఆటగాడిగా నిలవనున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, షకీబుల్ హసన్‌లు ఎనిమిది వరల్డ్ కప్స్‌తో తొలి స్థానంలో ఉన్నారు. గాయం నుంచి కోలుకున్న లోకీ ఫెర్గూసన్ తిరిగి రాగా.. ఆడమ్ మిల్నే కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఫ్రంట్‌లైన్ వికెట్ కీపర్‌గా డెవాన్ కాన్వేను ఎంపిక చేసింది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన కివీస్ జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. కాగా టి20 ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో న్యూజిలాండ్.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో టి20 ట్రై సిరీస్ ఆడనుంది. ట్రై సిరీస్‌కు కూడా ఇదే జట్టుతో ఆడుతుందని కివీస్ బోర్డు స్పష్టం చేసింది. ట్రై సిరీస్ ముగిసిన తర్వాత అక్టోబర్ 15న న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. ఇక ప్రపంచకప్‌లో కివీస్ తమ తొలి మ్యాచ్ అక్టోబర్ 22న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆ తర్వాత అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్‌తో పాటు క్వాలిఫయింగ్ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది.
టి20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్ , మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ.
Our squad for this year's @T20WorldCup in Australia. Details | https://t.co/JuZOBPwRyn #T20WorldCup pic.twitter.com/1s4QBL5bGH
— BLACKCAPS (@BLACKCAPS) September 19, 2022
చదవండి: KL Rahul: 'అలా అనుకుంటే ఎవరు పర్‌ఫెక్ట్‌గా లేరు.. ఇప్పుడేంటి?'
Comments
Please login to add a commentAdd a comment