ఎజాజ్ పటేల్(ఫైల్ ఫోటో)
న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ మీ అందరికి గుర్తుండే ఉంటాడు. గతేడాది డిసెంబర్‌లో వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి ఎజాజ్ పటేల్ క్రికెట్ చరిత్రను తిరగరాశాడు. తద్వారా టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఎజాజ్ పటేల్ కంటే ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేలు ఈ ఘనత సాధించారు. తాజాగా ఎజాజ్ పటేల్ ఏ జెర్సీతో ఆ ఫీట్ సాధించాడో.. అదే జెర్సీని వేలం వేయబోతున్నట్లు తెలిపాడు. ఎజాజ్ పటేల్ తన టీషర్ట్ వేలం వేయడం వెనుక దాగున్న చిన్నకథను స్టఫ్ డాట్‌కామ్ వెబ్‌సైట్ రివీల్ చేసింది.
గతేడాది ఎజాజ్ పటేల్ కూతురు ఆరోగ్య సమస్యతో బాధపడింది. న్యూజిలాండ్‌లోని స్టార్‌షిప్ చిల్రన్ ఆసుపత్రిలో తన కూతురుకు చికిత్స చేయించాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కొన్నిరోజులు ఉండాల్సి వచ్చింది. కొంచెం భయమైనప్పటికి ఎజాజ్ పటేల్ కూతురు తొందరగానే రికవరీ అయింది. అయితే తన కూతురును బాగు చేసిన ఆసుపత్రికి ఏదైనా చేయాలని భావించాడు. కొన్నిరోజుల క్రితం స్టార్‌షిప్ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగం చిన్న పిల్లల చికిత్స కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న ఎజాజ్ పటేల్ 10 వికెట్ ఫీట్ సాధించిన రోజున వేసుకున్న టీషర్ట్‌ను వేలానికి వేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ టీషర్ట్‌పై న్యూజిలాండ్ జట్టు సభ్యుల సంతకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎజాజ్ తన టీషర్డ్‌ను వేలానికి పెట్టాడు.. బుధవారం(మే 11తో) వేలం ముగియనుంది.
ఇక టీమిండియాతో తొలి టెస్టులో 14 వికెట్లతో ఎజాజ్ పటేల్ మంచి ప్రదర్శన చేసినప్పటికి జట్టు ఓటమిపాలైంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత న్యూజిలాండ్ 65 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆడిన భారత్ ఇన్నింగ్స్‌ను 276 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తద్వారా న్యూజిలాండ్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచగా.. కివీస్ 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టును గెలిచిన టీమిండియా 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మకు రెగ్యులర్ టెస్టు కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. ఆ తర్వాత జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది.
చదవండి: IND Vs NZ: వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్‌గా ‘టెన్’ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment