Spin bowler
-
స్పిన్ దిగ్గజం కన్నుమూత
ఇంగ్లండ్ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్వుడ్ (78) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా డెరిక్ తుదిశ్వాస విడిచాడని తెలుస్తుంది. 1966-82 మధ్య ఇంగ్లండ్ తరఫున 86 టెస్ట్‌ల్లో 297 వికెట్లు పడగొట్టిన డెరిక్.. ఆ జట్టు తరఫున నేటికి అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. అలాగే డెరిక్ ఇంగ్లండ్ తరఫున ఆరో అత్యధిక వికెట్ టేకర్‌గానూ కొనసాగుతున్నాడు. కౌంటీల్లో కెంట్కు సుదీర్ఘకాలం పాటు (1963-87) ప్రాతనిథ్యం వహించిన డెరిక్.. ఆ జట్టు తరఫున 900కు పైగా మ్యాచ్‌లు ఆడి 2523 వికెట్లు పడగొట్టాడు. 17 ఏళ్ల వయసులోనే కెంట్కు ఆడటం మొదలుపెట్టిన డెరిక్.. 25 ఏళ్ల వయసులోపే 1000 ఫస్ట్ క్లాస్ వికెట్లు పడగొట్టి రికార్డుల్లోకెక్కాడు. డెరిక్ కెంట్ తరఫున ఓ సీజన్లో 100కు పైగా వికెట్ల ఘనతను 10 సార్లు సాధించాడు. 1966 సీజన్లో డెరిక్ ఏకంగా 157 వికెట్లు పడగొట్టాడు. డెరిక్ 1966, 1967, 1978, 1979 సంవత్సరాల్లో ఇంగ్లండ్ లీడింగ్ బౌలర్‌గా కొనసాగాడు. డెరిక్ 1969 సెప్టెంబర్ నుంచి 1973 ఆగస్ట్ వరకు ఐసీసీ టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా చలామణి అయ్యాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుకు వన్డేల్లో సైతం ప్రాతినిథ్యం వహించిన డెరిక్.. ఈ ఫార్మాట్లో 26 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు పడగొట్టాడు. డెరిక్ 1975 వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఇంగ్లండ్‌కు ఆడాడు. వికెట్లు పడగొట్టడమే కాకుండా ఎన్నో అవార్డులు అందుకున్న డెరిక్.. 2009లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ఎంపికయ్యాడు. డెరిక్ 2006లో కెంట్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా.. 2008లో ఎంసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. డెరిక్ మరణం కెంట్ క్రికెట్ కుటుంబానికి తీరని లోటు అని క్లబ్ ప్రస్తుత అధ్యక్షుడు సైమన్ ఫిలిప్ సంతాప ప్రకటన విడుదల చేశారు. -
క్యూరేటర్ నుంచి ఆసీస్ స్పిన్ లెజెండ్‌గా.. ఏకంగా షేన్ వార్న్ సరసన!
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానం.. తర్వాతి మ్యాచ్ కోసం క్యురేటర్ల బృందం పిచ్ తయారు చేస్తోంది. అందులో ఒక 24 ఏళ్ల కుర్రాడు అమితోత్సాహంతో అందరికంటే వేగంగా చకచకా పని పూర్తి చేస్తున్నాడు. ముఖ్యంగా పిచ్ చివర్లో స్టంప్స్ వద్ద స్పిన్ బంతి టర్నింగ్‌కు సంబంధించి సహచరులకు ప్రత్యేక సూచనలు ఇస్తూ వాటరింగ్ చేయిస్తున్నాడు. అతను కొన్నాళ్ల క్రితమే ఆ మైదానానికి బదిలీపై వచ్చాడు. అంతకు ముందు నాలుగేళ్ల పాటు కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ గ్రౌండ్లోనూ ఇదే పని చేశాడు. పిచ్ తయారీపై బేసిక్స్ నేర్చుకొని అక్కడే పూర్తి స్థాయిలో శిక్షణ కూడా పొందాడు. అయితే క్యురేటర్‌గా అనుభవం మాత్రమే కాదు ఒక ఆటగాడి తరహాలో అతనికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ అడిలైడ్‌లోని కోచ్‌లను ఆకర్షించింది. అనంతరం జట్లు ప్రాక్టీస్‌కు సిద్ధమైనప్పుడు నెట్ బౌలర్లు తక్కువ పడటంతో నువ్వు బౌలింగ్ చేయగలవా అని కోచ్ డారెన్ బెరీ ఈ కుర్రాడిని అడిగాడు. కచ్చితంగా అని బదులిచ్చిన అతను వెంటనే బంతితో బరిలోకి దిగిపోయాడు. అతని స్పిన్ బౌలింగ్ శైలి, టర్నింగ్ రాబడుతున్న తీరు కోచ్‌ను అమితాశ్చర్యానికి గురి చేశాయి. అతని వివరాలను తెలుసుకోగా.. తాను అప్పటికే చాలా చోట్ల క్రికెట్ ఆడానని, అయితే అవేవీ గుర్తింపు పొందిన స్థాయిలో కాదని ఆ బౌలర్ చెప్పాడు. దాంతో నీకు తగిన అవకాశం కల్పిస్తానన్న కోచ్ బెరీ మాట తప్పలేదు. అతని ప్రతిభ గురించి అందరికీ చెప్పి అడిలైడ్ టి20 టీమ్ రెడ్బ్యాక్స్లోకి ఎంపిక చేశాడు. అంతే.. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తొలి అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని సత్తా చాటడంతో వరుసగా మ్యాచ్‌లు దక్కాయి. ఆపై ఫార్మాట్ మారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడే అవకాశమూ లభించింది. దానిని అందిపుచ్చుకొని ఆ బౌలర్ ఉవ్వెత్తున ఎగశాడు. ఏడు నెలల వ్యవధిలోనే జాతీయ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పుష్కరకాలంగా ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్న ఆ బౌలర్ పేరే నాథన్ లయన్. క్యురేటర్‌గా మొదలై టెస్టుల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందడం వరకు ఆఫ్‌స్పిన్నర్ లయన్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. స్టూవర్ట్ మెక్‌గిల్, మైకేల్ బీర్, డోహర్తి, క్రేజా, మెక్‌గెయిన్, హారిట్జ్, స్టీవ్ స్మిత్, హాగ్, హాలండ్, వైట్, కాసన్.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మందితో కూడిన జట్టు ఇది. ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ రిటైర్మెంట్ తర్వాత ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అన్వేషణ సుదీర్ఘంగా సాగింది. ఆ ప్రయత్నంలో భాగంగా వారు ప్రయత్నించిన 11 మంది స్పిన్నర్ల పేర్లు ఇవి. కానీ ఇందులో ఏ ఒక్కరూ ప్రతిభపరంగా వార్న్ దరిదాపుల్లోకి రావడం అటుంచి.. కనీసం పోలికకు కూడా అర్హత లేని స్థాయి వారిది. అందుకే ఎన్ని అవకాశాలు కల్పించినా ప్రతిభను చూపించలేక అతి తక్కువ సమయంలోనే కనుమరుగైపోయారు. వార్న్ స్థాయిలో కాకపోయినా, కనీసం ఉపఖండంలో సిరీస్‌లు ఆడేందుకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు తగినట్లుగా కొంతయినా ప్రభావం చూపించేవాడు ఉంటే చాలని ఆసీస్ క్రికెట్ భావించినా.. అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఇక స్పిన్నర్ల వేటను మానేసి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచవ్యాప్తంగా ఏ మైదానంలో ఆడినా తమ పేసర్ల బలాన్ని నమ్ముకుంటూ బరిలోకి దిగుతూ వచ్చింది. అలాంటి సమయంలో నాథన్ లయన్ వచ్చాడు. ఎలాంటి గందరగోళం లేకుండా సంప్రదాయ స్పిన్ బౌలింగ్, క్లాసికల్‌గా బంతిని ఫ్లయిట్ చేయడానికి ఇష్టపడే స్పిన్నర్‌గా లయన్ వెలుగులోకి వచ్చాడు. ఇలాంటి స్పిన్నర్లు సాధారణంగా ఉపఖండంలోనే గుర్తింపు దక్కించుకుంటారు. కానీ ఆసీస్‌కు లయన్ రూపంలో అలాంటి ఆటగాడు దక్కాడు. అందుకే వారు అతడిని కళ్లకు అద్దుకొని జట్టులోకి తీసుకున్నాడు. లయన్ కూడా తన ఎంపికకు న్యాయం చేస్తూ వారిని ఎప్పుడూ నిరాశపరచలేదు. అటు ఉపఖండం పిచ్‌లపై కూడా సత్తా చాటడంతో పాటు స్పిన్‌ను ఏమాత్రం అనుకూలించని ఆసీస్ మైదానాల్లోనూ ప్రత్యర్థులపై చెలరేగి తాను లేకుండా ఆసీస్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడలేని స్థాయికి చేరుకున్నాడు. వార్న్‌కు సరైన వారసుడినని నిరూపించుకుంటూ 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఏకంగా 500 టెస్టు వికెట్లతో ఇప్పుడు శిఖరాన నిలిచాడు లయన్. అలా మొదలైంది.. 2011, సెప్టెంబర్ 1.. గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు. లయన్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్‌కు దిగాడు. రౌండ్ ద వికెట్‌గా వచ్చి బంతిని సంధించాడు. గ్రిప్, ఫ్లయిట్, టర్న్, బౌన్స్.. అనూహ్యంగా వచ్చిన బంతిని ఆడలేక లంక దిగ్గజం సంగక్కర గందరగోళానికి గురయ్యాడు. బ్యాట్‌ను తాకిన బంతి స్లిప్స్‌లో కెప్టెన్ క్లార్క్ చేతుల్లో పడింది. అంతే.. అటు లయన్‌తో పాటు ఇటు ఆసీస్ బృందంలో సంబరాలు. టెస్టు క్రికెట్లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన అత్యంత అరుదైన జాబితాలో లయన్‌కు చోటు లభించింది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో అతనికి ఘనారంభం దొరికింది. అద్భుతంగా మొదలైన కెరీర్ ఆపై మరిన్ని ఘనతల దిశగా సాగింది. నాలుగేళ్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా తరఫున వికెట్లపరంగా అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్‌గా లయన్ గుర్తింపు తెచ్చేసుకున్నాడు. యాషెస్‌తో మేలిమలుపు.. ఆటలో ఎంత సత్తా ఉన్నా, అద్భుతాలు చేసే నైపుణ్యం ఉన్నా ఆటగాళ్లకు తగిన అవకాశం, సరైన వేదిక ఎంతో ముఖ్యం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లకు సంబంధించి యాషెస్ సిరీస్ అలాంటిదే. ఈ చిరకాల ప్రత్యర్థుల జట్లలో ఎంతో మంది ఆటగాళ్లను యాషెస్ సిరీస్ హీరోలను చేస్తే, మరెంతో మందిని జీరోలను చేస్తుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటున్న క్రమంలో 2011 యాషెస్ సిరీస్ కోసం లయన్‌కు చాన్స్ లభించింది. ఎంతో ఉత్సాహంతో తన టాలెంట్ చూపించేందుకు లయన్ సిద్ధం కాగా, వేర్వేరు పరిస్థితులను కారణాలుగా చూపుతూ టీమ్ మేనేజ్మెంట్ తొలి రెండు టెస్టుల్లో అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది. అయితే తర్వాతి మూడు టెస్టుల్లో అవకాశం సాధించి కీలక దశలో తొమ్మిది వికెట్లు పడగొట్టిన లయన్ రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి ఆసీస్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే జరిగిన రిటర్న్ యాషెస్ సిరీస్‌తో లయన్ విలువేమిటో ఆసీస్ మేనేజ్మెంట్కు బాగా తెలిసొచ్చింది. సొంత గడ్డపై 19 వికెట్లతో సత్తా చాటిన లయన్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఆ వెంటనే దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడా తన స్పిన్ పదును చూపించడంలో అతను సఫలమయ్యాడు. ఆ తర్వాత 2022లో గాయం కారణంగా ఒక మ్యాచ్ దూరమయ్యే వరకు లయన్ లేకుండా ఆస్ట్రేలియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదంటే అతిశయోక్తి కాదు. ఆసీస్ దిగ్గజంగా ఎదిగి.. షేన్‌వార్న్ తర్వాత ఆస్ట్రేలియా అత్యుత్తమ స్పిన్నర్‌గా లయన్‌కు ఎప్పుడో గుర్తింపు దక్కింది. స్పిన్నర్లకు వికెట్లే దక్కవని భావించే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజీలండ్లాంటి దేశాల్లో కూడా అతను పెద్ద సంఖ్యలో వికెట్లు పడగొట్టాడు. కానీ ఏదో అసంతృప్తి. అతడిని ప్రత్యేకంగా నిలబెట్టే మరి కొన్ని ప్రదర్శనలు కావాలి. ఒక స్పిన్నర్ గుర్తింపు దక్కించుకునేందుకు భారత్‌కంటే సరైన వేదిక ఏముంటుంది. భారత గడ్డపై సత్తా చాటి స్పిన్‌కు అనుకూలించే మైదానాలే అయినా భారతీయేతర స్పిన్నర్లు ఎవరూ ఇక్కడ తమదైన ముద్ర వేయలేకపోయారు. ఇక్కడా రాణిస్తే అతని కీర్తి రెట్టింపవుతుంది. లయన్ సరిగ్గా అదే చేసి చూపించాడు. భారత గడ్డపై ఆడిన 11 టెస్టుల్లో కేవలం 27.35 సగటుతో 56 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన విదేశీ బౌలర్‌గా నిలిచాడు. అతని కెరీర్ సగటు (30.85) కంటే ఇది తక్కువ కావడం విశేషం. షేన్ వార్న్ సరసన లయన్ కెరీర్లో మూడు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (8/50, 8/64, 7/94) భారత దేశంలోనే వచ్చాయి. లయన్ సాధించిన ఈ తొలి 8 వికెట్ల ప్రదర్శనకు బెంగళూరు వేదికైంది. సొంత గడ్డపై కంటే విదేశాల్లోనే ఎక్కువ వికెట్లు (258) సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో లయన్ కూడా ఉన్నాడు. కాగా స్వదేశంలో ఇటీవల పాకిస్తాన్ మూడో టెస్టు(2024) సందర్భంగా 250 వికెట్ల మైలురాయి అందుకుని షేన్ వార్న్ సరసన నిలిచాడు లయన్. ఆసీస్ ఓడిన మ్యాచ్‌లలో తీసిన వికెట్లకంటే (138) ఆ జట్టు గెలిచిన మ్యాచ్‌లలో అతను పడగొట్టిన వికెట్లు (301) అతని విలువను చూపిస్తూ దిగ్గజ స్థాయిని అందించాయి. ఆస్ట్రేలియా జట్టు అవసరాలు, కూర్పు కారణంగా లయన్ వన్డే కెరీర్ 29 మ్యాచ్‌లకే పరిమితం అయినా.. టెస్టుల్లో అతని కీర్తి శాశ్వతం. 36 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న లయన్ టెస్టు క్రికెట్లో మున్ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయం. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
అరుదైన ఘనత.. టీమిండియా తరపున లీడింగ్ వికెట్‌టేకర్‌గా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. మొదట బ్యాటింగ్‌లో 48 పరుగులు చేసిన జడేజా.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్.. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జడేజా టెస్టుల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జడేజా రికార్డులకెక్కాడు. గ్రీన్‌ను ఔట్ చేయడం ద్వారా జడేజా 268వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బిషన్ సింగ్ బేడీ(266 వికెట్లు)ని క్రాస్ చేసి ఓవరాల్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో రంగనా హెరాత్(433 వికెట్లు), డేనియల్ వెటోరి(362 వికెట్లు), డ్రీక్ అండర్వుడ్(298 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియా తరపున లెఫ్టార్మ్ స్పిన్నర్లలో జడేజా(268 వికెట్లు), బిషన్ సింగ్ బేడీ(266 వికెట్లు) వినూ మన్కడ్(161 వికెట్లు), రవిశాస్త్రి(151 వికెట్లు), దిలిప్ దోషి(114 వికెట్లు), ప్రగ్యాన్ ఓజా(113 వికెట్లు) వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్ల జాబితాలో జడేజా ఏడో స్థానానికి చేరుకున్నాడు. జడేజా ప్రస్తుతం 65 టెస్టుల్లో 268 వికెట్లతో కొనసాగుతున్నాడు. జడ్డూ కంటే ముందు అనిల్ కుంబ్లే(619 వికెట్లతో) అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్(474 వికెట్లు), కపిల్ దేవ్(434 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. హర్బజన్(417 వికెట్లు), ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్లు 311 వికెట్లతో నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. Sir Ravindra Jadeja 🔥👏#Cricket #RavindraJadeja #TeamIndia #WTCFinal #InsideSport pic.twitter.com/p2h1TaVk0q — InsideSport (@InsideSportIND) June 10, 2023 Ravi Jadeja has joined the group of the elite spinners. Left-arm spinners with most wickets in Test cricket: ⁰433 - Rangana Herath ⁰362 - Daniel Vettori ⁰297 - Derek Underwood ⁰267 - Ravindra Jadeja ⁰266 - Bishan Singh Bedi#WTCFinal #WTC23Final pic.twitter.com/S6dl7xwyVM — Vipin Tiwari (@vipintiwari952) June 10, 2023 Ravindra Jadeja now has most Test wickets for an Indian left-arm spinner. He overtook Bishan Singh Bedi in the list by picking his 267th Test wicket during WTC 2023 final. Sir Ravindra Jadeja 🔥🔥🔥 One of the best All rounder in the world.❤ pic.twitter.com/41OnAVamLP — Hardy🇮🇳 (@Hardy10001000) June 10, 2023 చదవండి: WTC Final: టీమిండియా గెలుస్తుందా లేక చేతులెత్తేస్తుందా..? అడ్డుకునేలోపే అదిరిపోయే ట్విస్ట్.. జడ్డూ దెబ్బకు మైండ్‌బ్లాక్ -
ఆస్ట్రేలియా క్రికెట్లో కలవరం.. తర్వాత ఎవరు?
ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక విషయంలో కలవరం మొదలైంది. ప్రస్తుతం జట్టులో నాథన్ లియోన్ మాత్రమే ప్రధాన స్పిన్నర్‌గా కనిపిస్తున్నాడు. లియోన్ వయస్సు 35 సంవత్సరాలు. రిటైర్మెంట్కు దగ్గరికి వచ్చిన అతను మహా అయితే మరో రెండు సంవత్సరాలు ఆడే అవకాశం ఉంది. దిగ్గజం షేన్ వార్న్ తర్వాత టాప్‌క్లాస్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న లియోన్ తన కెరీర్లో 117 టెస్టులాడి 468 వికెట్ల పడగొట్టాడు. దశాబ్దం కాలంగా లియోన్ ఆసీస్ టెస్టు జట్టులో ఏకైక ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతూ వస్తున్నాడు. మరి అతను రిటైర్ అయ్యాకా ఆసీస్ క్రికెట్లో స్పిన్ భాద్యతలు తీసుకునేది ఎవరనేదానిపై చర్చ మొదలైంది. ఆసీస్ లాంటి ఫాస్ట్ పిచ్ మైదానాలపై పేస్ బౌలర్లకు కొదువ లేదు. ఆ దేశం నుంచి వచ్చే బౌలర్లలోనే ఎక్కువగా మీడియం, ఫాస్ట్ బౌలర్లే కనిపిస్తారు తప్ప స్పిన్నర్లు చాలా తక్కువ. స్వదేశంలో ఆడినంత వరకు పేస్ దళంతోనే మ్యాచ్‌లు గెలిచే ఆస్ట్రేలియా భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లకు వచ్చేసరికి స్పిన్నర్లను వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే టాడ్ మర్ఫీ రూపంలో ఆస్ట్రేలియా జట్టుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు రెండు టెస్టులు కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ఇదే విషయమై ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పందించాడు. ''ప్రస్తుతం ఆస్ట్రేలియాకు పెద్ద దిక్కులా మారాడు. వార్న్ లాంటి దిగ్గజ ఆటగాడిని భర్తి చేయలేకపోయిన ఉన్నంతలో అతను టాప్ క్లాస్ స్పిన్నర్. మరి లియోన్ రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ క్రికెట్లో స్పిన్ బాధ్యతలు తీసుకునేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి. అందుకు నా సమాధానం 22 ఏళ్ల టాడ్ మర్ఫీ. టీమిండియాతో తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా తరపున టాడ్ మర్ఫీ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏడు వికెట్లతో ఆకట్టుకొని తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడు వికెట్లలోనూ ఐదు టాప్‌క్లాస్ బ్యాటర్లవే ఉన్నాయి. ఉపఖండం పిచ్‌లపై ప్రభావం చూపుతున్న ఒక డెబ్యూ బౌలర్ తర్వాతి కాలంలో జట్టుకు ప్రధాన స్పిన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. నాథన్ లియోన్ అలా వచ్చినవాడే. అతని వారసత్వాన్ని టాడ్ మర్ఫీ కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. అయితే ఆస్ట్రేలియాకు టాడ్ మర్ఫీ రూపంలో ఒక మంచి స్పిన్నర్ దొరికినట్లే. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న మర్ఫీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అద్బుతాలు చేయగలడన్న నమ్మకం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇరుజట్ల మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. రెండు టెస్టుల్లోనూ విజయాలు అందుకున్న టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ రెండు టెస్టులు కూడా రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. ఇక మూడో టెస్టు మార్చి ఒకటి నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది. చదవండి: 'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్' 'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు -
టీమిండియాతో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా నెట్ బౌలర్‌గా ఢిల్లీ యువ ఆటగాడు..!
భారత్‌తో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా విధాలుగా సిద్దమవుతోంది. టీమిండియా స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రోటీస్ జట్టు తమ నెట్ బౌలర్‌గా 14 ఏళ్ల ఢిల్లీ స్పిన్నర్ రౌనక్ వాఘేలాను ఎంపికచేసుకుంది. వాఘేలా ఢిల్లీకి చెందిన స్థానిక క్రికెటర్. అతడు వెంకటేశ్వర్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అదే విధంగా ఢిల్లీ అండర్-16 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కాగా దక్షిణాఫ్రికా జట్టులో లెఫ్మ్ ఆర్మ్ ఆర్థోడక్స్ స్పిన్నర్లు తక్కువగా ఉండటంతో వాఘేలాకు నెట్ బౌలర్‌గా అవకాశం దక్కింది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టీ20 జూన్ 9న ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఇరు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి టీ20 సిరీస్: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్. చదవండి: IND vs SA: టీమిండియాను భయపెడుతోన్న దక్షిణాఫ్రికా త్రయం.. గెలవడం అంత ఈజీ కాదు..! -
భారత్‌పై పదికి పది వికెట్లు తీసిన బౌలర్ టీషర్ట్ వేలానికి..
న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ మీ అందరికి గుర్తుండే ఉంటాడు. గతేడాది డిసెంబర్లో వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి ఎజాజ్ పటేల్ క్రికెట్ చరిత్రను తిరగరాశాడు. తద్వారా టెస్టు క్రికెట్లో ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఎజాజ్ పటేల్ కంటే ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేలు ఈ ఘనత సాధించారు. తాజాగా ఎజాజ్ పటేల్ ఏ జెర్సీతో ఆ ఫీట్ సాధించాడో.. అదే జెర్సీని వేలం వేయబోతున్నట్లు తెలిపాడు. ఎజాజ్ పటేల్ తన టీషర్ట్ వేలం వేయడం వెనుక దాగున్న చిన్నకథను స్టఫ్ డాట్‌కామ్ వెబ్సైట్ రివీల్ చేసింది. గతేడాది ఎజాజ్ పటేల్ కూతురు ఆరోగ్య సమస్యతో బాధపడింది. న్యూజిలాండ్‌లోని స్టార్‌షిప్ చిల్రన్ ఆసుపత్రిలో తన కూతురుకు చికిత్స చేయించాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కొన్నిరోజులు ఉండాల్సి వచ్చింది. కొంచెం భయమైనప్పటికి ఎజాజ్ పటేల్ కూతురు తొందరగానే రికవరీ అయింది. అయితే తన కూతురును బాగు చేసిన ఆసుపత్రికి ఏదైనా చేయాలని భావించాడు. కొన్నిరోజుల క్రితం స్టార్‌షిప్ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగం చిన్న పిల్లల చికిత్స కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న ఎజాజ్ పటేల్ 10 వికెట్ ఫీట్ సాధించిన రోజున వేసుకున్న టీషర్ట్‌ను వేలానికి వేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ టీషర్ట్‌పై న్యూజిలాండ్ జట్టు సభ్యుల సంతకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎజాజ్ తన టీషర్డ్ను వేలానికి పెట్టాడు.. బుధవారం(మే 11తో) వేలం ముగియనుంది. ఇక టీమిండియాతో తొలి టెస్టులో 14 వికెట్లతో ఎజాజ్ పటేల్ మంచి ప్రదర్శన చేసినప్పటికి జట్టు ఓటమిపాలైంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత న్యూజిలాండ్ 65 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆడిన భారత్ ఇన్నింగ్స్‌ను 276 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తద్వారా న్యూజిలాండ్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచగా.. కివీస్ 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టును గెలిచిన టీమిండియా 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మకు రెగ్యులర్ టెస్టు కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. ఆ తర్వాత జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. చదవండి: IND Vs NZ: వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్‌గా ‘టెన్’ రికార్డు -
Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం
-
విండీస్ స్పిన్ దిగ్గజం కన్నుమూత
కరీబియన్ల తరఫున ఆడిన తొలి భారత సంతతి క్రికెటర్, ఇంగ్లండ్‌ను తొలిసారి ఓడించిన విండీస్ జట్టులో సభ్యుడు, స్పిన్ దిగ్గజం సోని రామ్‌దిన్ ఆదివారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా 92 ఏళ్ల వయసులో రామ్‌దిన్ తుది శ్వాస విడిచినట్టు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ఓ ప్రకటనలో తెలిపింది. రామ్‌దిన్ మరణ వార్త విని వెస్టిండీస్‌తో పాటు పలువురు భారత క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. తొలి తరం మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన రామ్‌దిన్.. తన కెరీర్లో 43 టెస్టులాడి 158 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 184 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 758 వికెట్లు పడగొట్టాడు. చదవండి: సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ అరెస్ట్ -
పాక్ స్పిన్ దిగ్గజం కన్నుమూత
లాహోర్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్ దిగ్గజం అబ్దుల్ ఖాదిర్(63) గుండెపోటుతో కన్నముశారు. తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. లాహోర్‌లోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్, ఉమర్ సోదరుడు కమ్రాన్ అక్మల్ ఈ వార్తను ధృవీకరించారు. దీంతో ఖాదిర్ హఠాన్మరణంపై పలువురు క్రీడానిపుణులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన 70-80 కాలంలో, తన బౌలింగ్ యాక్షన్, మణికట్టు స్పిన్ మ్యాజిక్‌తో అద్భుత విజయాలు అందించిన ఘనత ఖాదిర్దేనని క్రికెట్ పండితులు, ఇతరు అభిమానులు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎంతో ఇష్టమైన క్రికెటర్ అయిన ఖాదిర్ అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులు, 104 వన్డేల్లో మొత్తం 368 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక లెగ్‌స్పిన్ బౌలింగ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఖాదిర్ గుగ్లీకి కూడా ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చాడు. మరోవైపు ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్‌పై ఖాదిర్ విసిరిన సవాలు, దాని ఎదుర్కొన్న తీరు క్రికెట్ అభిమానులు ఎలా మర్చిపోగలరు? 2009 లో చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశారు. ఇంగ్లాండ్‌లో ఐసీసీ ప్రపంచ టి 20 గెలిచిన జట్టు ఆయన ఎంపిక చేసినదే కావడం విశేషం.ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ పిసిబి చైర్మన్ ఎజాజ్ బట్‌తో విభేదాలు రావడంతో ఖాదీర్ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అబ్దుల్ ఖాదిర్‌కు భార్య, నలుగురు కుమారులు. కుమారులు రెహమాన్, ఇమ్రాన్, సులేమన్ , ఉస్మాన్ ఫస్ట్ క్లాస్ స్థాయి క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించగా ఉస్మాన్ ( తండ్రిలాగే లెగ్ స్పిన్నర్ కూడా) గత సీజన్లో బిగ్ బాష్ టీ 20 లీగ్‌లో కనిపించాడు. ఇతను త్వరలో ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నామని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం పాక్ జట్టుకు ఆడుతున్న ఉమర్ అక్మల్.. ఖాదిర్‌కు స్వయానా అల్లుడు. ఖాదిర్ ఈనెల (సెప్టెంబర్) 15 న తన 64 వ పుట్టినరోజు జరుపుకుని వుండేవారు -
అజంతా మెండిస్ వీడ్కోలు
కొలంబో: పదకొండేళ్ల క్రితం శ్రీలంక గడ్డపై తన తొలి సిరీస్‌లోనే భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను వణికించిన మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్. అతని దెబ్బకు టీమిండియా సిరీస్ కోల్పో యింది. మెండిస్ ‘క్యారమ్’ బంతులు మన బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాయి. ఆరు ఇన్నింగ్స్‌లలో సచిన్, గంగూలీ కనీసం ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేకపోగా, ద్రవిడ్ మాత్రం ఒకే ఒక అర్ధసెంచరీ సాధించాడు! మూడు టెస్టులలో ఏకంగా 26 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. అయితే తర్వాతి రోజుల్లో ఆ మిస్టరీని బ్యాట్స్‌మెన్ ఛేదించిన తర్వాత అతను తేలిపోయాడు. ఒక సాధారణ స్పిన్నర్‌గా మారిపోవడంతో పాటు గాయాల కారణంగా కెరీర్లో వెనుకబడి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. శ్రీలంక తరఫున 2015లో ఆఖరి మ్యాచ్ ఆడిన అజంతా ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. 19 టెస్టుల్లో 34.77 సగటుతో మెండిస్ 70 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 21.86 సగటుతో 152 వికెట్లు తీసిన అతను, 39 టి20 మ్యాచ్‌లలో 66 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మెండిస్ పేరిటే అంతర్జాతీయ టి20ల్లో టాప్–2 బౌలింగ్ ప్రదర్శనలున్నాయి. 2012లో జింబాబ్వేపై 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన అతను... అంతకుముందు ఏడాది ఆసీస్‌పై 16 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. -
వారిది ‘హోం వర్క్’... మనది ‘నో వర్క్’
సాక్షి క్రీడావిభాగం : ప్రత్యర్థిని చితక్కొట్టడమే తెలిసిన జట్టుకు ప్రత్యర్థి చేతిలో చిత్తవడం కొత్తగా అనిపిస్తోంది. వందల పరుగుల ఆధిక్యం అందుకోవడం, ఆ తర్వాత స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను పట్టేయడం అలవాటుగా మార్చుకున్న టీమ్ అదే వలలో పడి విలవిల్లాడటం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. గింగిరాలు తిరిగే బంతిని ఎదుర్కొనేందుకు ఇక్కడికి వచ్చే ప్రతీ విదేశీ ఆటగాడు తనదైన స్థాయిలో ఎంతో కొంత సన్నద్ధమయ్యే వస్తాడు. అది ఫలితాన్నిస్తుందా లేదా తర్వాత సంగతి. కానీ స్పిన్ కోసమే తయారయ్యాను అన్నట్లుగా పుణే పిచ్ ఎదురుగా కనిపిస్తుంటే భారత బ్యాట్స్‌మెన్ ఏ రకంగా సిద్ధమయ్యారు? దిగ్గజ స్పిన్ బౌలర్ కోచ్‌గా ఉన్న జట్టు స్పిన్‌ను అసలు ఆడలేకపోవడం ఏమిటి? మన బ్యాటింగ్ ఇంతేనా...? ‘భారత్‌లో నేను ఎన్నో టర్నింగ్ ట్రాక్‌లను చూశాను. కానీ ఇలాంటి పిచ్‌ను అసలు ఎప్పుడూ చూడలేదు’... ఈ పిచ్ వల్ల రాబోతున్న ప్రమాదాన్ని రవిశాస్త్రి ముందే ఊహించినట్లున్నాడు. తొలి రెండు రోజులు బ్యాటింగ్ చేయగలిగి ఉండి ఆ తర్వాత మూడో రోజు నుంచి పిచ్‌పై స్పిన్ ప్రభావం చూపించడం, మన బౌలర్లు చెలరేగిపోవడం భారత్‌లో సాధారణం. ఈ సీజన్లోనైతే అశ్విన్, జడేజాలు ఇలాంటి పిచ్‌లపై వికెట్ల మూటలు కట్టుకున్నారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు ఇదే ఫార్ములా ముందు చేతులెత్తేశాయి. కొన్నాళ్ల క్రితం నాగపూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు తరహా నాసిరకం పిచ్‌లు కాకుండా కాస్త జీవం ఉన్న వికెట్లు ఉండటంతో ఈ సీజన్లో భారత్‌పై ఎలాంటి విమర్శలు కూడా రాలేదు. అయినా సరే మరోసారి స్పిన్ పిచ్ మంత్రాన్నే జట్టు ఎంచుకుంది. క్యురేటర్‌కు బీసీసీఐ ఏదైనా సూచనలిచ్చిందా లేదా తెలీదు కానీ స్పిన్‌తోనే ఆస్ట్రేలియా పని పట్టేయవచ్చని భారత్ ఆత్మ (అతి)విశ్వాసంతో కనిపించింది. కానీ ఇదే పిచ్‌పై మన బ్యాటింగ్ గురించి మాత్రం పెద్దగా ఆలోచించినట్లు లేదు. ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్ చేయాలంటే కచ్చితంగా బ్యాట్స్‌మెన్‌లో అత్యుత్తమ నైపుణ్యం ఉండాలి. రెండు ఇన్నింగ్స్‌లలోనూ మనోళ్లు అవుటైన తీరు, వారి బలహీనతను బయట పెట్టింది. టర్న్ అవుతున్న బంతిని ఎదుర్కోలేక క్లోజ్ ఇన్ ఫీల్డర్లకే అంతా క్యాచ్‌లు ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లోనైతే ఐదు ఎల్బీడబ్ల్యూలు ఉన్నాయి. ఈ సీజన్లో చెప్పుకోదగ్గ స్పిన్నర్‌ను స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌ను భారత బ్యాట్స్‌మెన్ ఒక్కసారి ఎదుర్కోకపోవడం వల్ల కూడా ఈ హఠాత్ పరిణామానికి నిస్సహాయులై చూస్తుండిపోయారు. సాన్‌ట్నర్, సోధి, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ ఎవరిలో కూడా బంతిని పెద్దగా టర్న్ చేయగలిగే సామర్థ్యం లేదు. ఓకీఫ్ కూడా గొప్ప స్పిన్నరేమీ కాదు కానీ పిచ్ అతనికి బాగా కలిసొచ్చింది. వరుస విజయాలతో ఊపు మీద ఉండటంతో తమలో ఇంకా బయటపడని లోపాల గురించి టీమిండియా పట్టించుకోలేదు. మొదటి ఇన్నింగ్స్ వైఫల్యాన్ని రెండో ఇన్నింగ్స్‌లో కప్పిపుచ్చగలరని భావించినా, అదీ సాధ్యం కాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ బ్యాటింగ్ చూస్తే పిచ్‌లో మాత్రమే సమస్య లేదని, మన ఆటగాళ్లకే చేత కాలేదని స్పష్టంగా అర్థమవుతుంది. సన్నాహకాలతో సిద్ధంగా... నాలుగేళ్ల క్రితం 0–4తో అవమానకర రీతిలో ఓడిన సమయంలో పరాభవంతో పాటు ‘హోం వర్క్’ వివాదాన్ని కూడా వెంట తీసుకొచ్చిన ఆస్ట్రేలియా ఈసారి అసలైన ‘హోం వర్క్’తో సన్నద్ధమైంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎలాగూ స్పిన్ వికెట్ ఇవ్వరని తెలుసు కాబట్టి దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో తన సన్నాహాలు చేసింది. భారత్‌లో వికెట్లను రూపొందించేందుకు వాడే మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించిన పిచ్‌లపై ఆ జట్టు కఠోర సాధన చేసింది. సాధారణంగా స్పిన్‌లో షార్ట్‌లెగ్, సిల్లీ పాయింట్లాంటి స్థానాల్లో క్యాచ్ ఇచ్చే అవకాశం ఎక్కు వగా ఉంటుంది కాబట్టి బంతి ఏ రకంగా వచ్చినా ఆ స్థానాల్లోకి ఆడకుండా బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ చేశారు. ఈ టెస్టులో ఆస్ట్రేలియా కోల్పోయిన 20 వికెట్లలో ఎవరూ క్లోజ్ ఇన్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాకపోవడం విశేషం. ఆ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన భారత మాజీ ఆటగాడు శ్రీధరన్ శ్రీరామ్ జట్టుతో ఈ వికెట్లపై ప్రాక్టీస్ చేయించాడు. ఓకీఫ్ బౌలింగ్ మెరుగు పడటంతో అతనిదే కీలక పాత్ర. 2012లో ఇంగ్లండ్ తరఫున భారత్‌ను దెబ్బ తీసిన మాంటీ పనెసర్ కూడా ఆసీస్‌ను సిద్ధం చేయించడంలో ఆ జట్టుకు సహకరించాడు. భీకరమైన పుణే పిచ్‌పైనే ఆసీస్ చేసిన స్కోర్లు... స్మిత్, రెన్షా ఆట చూస్తే సాధారణ స్పిన్ పిచ్‌పై వారు అలవోకగా ఆడగలిగేవారేమో అనిపిస్తుంది. బెంగళూరులో ఎలా... ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం పిచ్ రూపంలోనే భారత్ ముందు పెద్ద సవాల్ నిలిచింది. పూర్తిగా స్పిన్ పిచ్ ఉంటే ఫలితం ఎలా ఉంటుందో పుణే చూపించింది. అలా అని బ్యాటింగ్ వికెట్ చేస్తే ఆసీస్‌లో కూడా మెరుగైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. పేస్ లేదా స్వింగ్‌కు అనుకూలించే విధంగా ఉంటే మన ఉమేశ్, ఇషాంత్ కంటే కచ్చితంగా స్టార్క్, హాజల్‌వుడ్ ఎక్కువ ప్రమాదకారిగా మారగలరు. సొంతగడ్డపై తొలి టెస్టు ఓడి భారత్ సిరీస్‌లో వెనుకబడిన సందర్భాలు చాలా తక్కువ. ఇలాంటి స్థితి నుంచి కోలుకొని మనోళ్లు ఎలా రాణిస్తారనేది చూడాలి. 5 సొంతగడ్డపై ఐదేళ్ల తర్వాత టెస్టుల్లో భారత్‌కు ఓటమి ఎదురైంది. చివరిసారి భారత్ 2012లో కోల్‌కతాలో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత భారత్‌కు వరుసగా 20 టెస్టుల్లో పరాజయమే లేదు. ఇందులో 17 టెస్టుల్లో గెలుపొందగా... మూడు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. 7 పుణేలో విజయానికి ముందు భారత గడ్డపై ఆస్ట్రేలియా వరుసగా ఏడు టెస్టుల్లో ఓడిపోయింది. 2 పరుగుల పరంగా (333) స్వదేశంలో భారత్‌కిది రెండో పెద్ద ఓటమి. 2004లో నాగ్‌పూర్‌లో ఆసీస్ చేతిలోనే భారత్ 342 పరుగులతో ఓడటం అతి పెద్ద ఓటమిగా ఉంది. 212 సొంతగడ్డపై రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 20 వికెట్లు కోల్పోయి భారత్ చేసిన అత్యల్ప స్కోరు ఇదే. 74 స్వదేశంలో భారత్ 20 వికెట్లు కోల్పో యిన మ్యాచ్‌లో ఆడిన అతి తక్కువ ఓవర్లు. 1 కెప్టెన్‌గా భారత్‌లో కోహ్లికిది తొలి ఓటమి. 2 ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్; 13/106... 1979–80 సీజన్) తర్వాత పర్యాటక జట్టు బౌలర్లలో రెండో ఉత్తమ ప్రదర్శన (12/70) చేసిన బౌలర్ ఓకీఫ్. 24 ఆసీస్ తరఫున ఇద్దరు స్పిన్నర్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 1993లో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో షేన్ వార్న్, టిమ్ మే ఐదేసి వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేశారు. 13 స్వదేశంలో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి తక్కువ పరుగులు చేయడం కోహ్లికిదే తొలిసారి. ఇంతకుమందు కోహ్లి 2012లో ఇంగ్లండ్ చేతిలో కోల్‌కతాలో ఓడిన టెస్టులో 26 పరుగులు చేశాడు.