భారత్‌తో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా విధాలుగా సిద్దమవుతోంది. టీమిండియా స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రోటీస్ జట్టు తమ నెట్ బౌలర్‌గా 14 ఏళ్ల ఢిల్లీ స్పిన్నర్ రౌనక్ వాఘేలాను ఎంపికచేసుకుంది. వాఘేలా ఢిల్లీకి చెందిన స్థానిక క్రికెటర్. అతడు వెంకటేశ్వర్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
అదే విధంగా ఢిల్లీ అండర్-16 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కాగా దక్షిణాఫ్రికా జట్టులో లెఫ్మ్ ఆర్మ్ ఆర్థోడక్స్ స్పిన్నర్లు తక్కువగా ఉండటంతో వాఘేలాకు నెట్ బౌలర్‌గా అవకాశం దక్కింది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టీ20 జూన్ 9న ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఇరు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి
టీ20 సిరీస్: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
దక్షిణాఫ్రికా జట్టు:
తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్.
చదవండి: IND vs SA: టీమిండియాను భయపెడుతోన్న దక్షిణాఫ్రికా త్రయం.. గెలవడం అంత ఈజీ కాదు..!
Comments
Please login to add a commentAdd a comment