
కరీబియన్ల తరఫున ఆడిన తొలి భారత సంతతి క్రికెటర్, ఇంగ్లండ్‌ను తొలిసారి ఓడించిన విండీస్ జట్టులో సభ్యుడు, స్పిన్ దిగ్గజం సోని రామ్‌దిన్ ఆదివారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా 92 ఏళ్ల వయసులో రామ్‌దిన్ తుది శ్వాస విడిచినట్టు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ఓ ప్రకటనలో తెలిపింది. రామ్‌దిన్ మరణ వార్త విని వెస్టిండీస్‌తో పాటు పలువురు భారత క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. తొలి తరం మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన రామ్‌దిన్.. తన కెరీర్‌లో 43 టెస్టులాడి 158 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 184 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 758 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ అరెస్ట్