న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డర్న్ గురువారం అనుహ్యంగా తర పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి ప్రధాని వారసుడిగా విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్కిన్స్ కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్నారు. ఆమె తర్వాత పార్టీ సభ్యుల్లో కొత్త ప్రధానిగా హిప్కిన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 44 ఏళ్ల రాజకీయ నాయకుడు పార్లమెంటు సభ్యుల సమావేశంలో పాలక లేబర్ పార్టీకి నాయకత్వం వహించే ఏకైక వ్యక్తిగా జెసిండా స్థానంలో ఉన్నారు. ఆయన ఒక్కరే పోటీలో ఉండటం వల్ల దీనికోసం తొలుత పార్టీ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉంది.
పైగా ఆ స్థానానికి పోటీపడేందుకు పార్టీలో సరైన సభ్యులు ఎవ్వరూ లేకపోవడంతో చట్ట సభ సభ్యులంతా ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హిప్కిన్స్ ఆదివారం లాంఛనంగా జరిగే తన సహచరుల ఆమోదం కోసం వేచి ఉన్నాడు. దీంతో న్యూజిలాండ్ దేశ 41వ ప్రధాన మంత్రిగా హిప్కిన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఐతే ఆమె వారసుడిగా కేవలం 48 గంటల్లో ఎన్నుకున్నందున తాను ఫిబ్రవరి 7నాటికి పదవీవిరమణ చేస్తానని జెసిండా ఆర్డర్న్ తెలిపారు. ఈ క్రమంలో హిప్‌కిన్స్ మాట్లాడుతూ తాను చాలా నిర్ణయాత్మకంగా ఉన్నానని, పనులు వేగవంతంగా పూర్తి చేయగలనని ధీమాగా చెప్పారు. అదీగాక హిప్‌కిన్స్‌కి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. పైగా తాను ఈ ఎన్నికలలో విజయం సాధించగలనని నమ్మకంగా చెప్పారు.
అలాగే మాజీ ప్రధాని జెసిండాను అవసరమైన సమయంలో కీలక బాధ్యతలను నిర్వర్తించిన అత్యవసరమైన నాయకురాలిగా ప్రశంసించారు. ఆమె ఇక ఈ బాధ్యతలను మోయలేని స్థితిలో ఉందని అన్నారు. ఆమె ప్రకృతి వైపరిత్యాలు, కోవిడ్ మహమ్మారీ, అత్యంత ఘోరమైన ఉగ్రదాడి సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించిన ధైర్యవంతురాలైన నాయకురాలని కొనియాడారు. కాగా, తాను ఈ కొత్త పదవిని శక్తిమంతమైనదే గాక తనకొక కొత్త ఉత్సాహన్ని తీసుకొచ్చేదిగా భావిస్తున్నానని హిప్కిన్స్ చెప్పుకొచ్చారు. అలాగే న్యాయ మంత్రి కిరీ అల్లన్ హిప్కిన్స్ అద్భుతమైన బలమైన ప్రధాని అవుతాడని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
అదీగాక కరోనా ఉధృత సమంయంలో సమర్ధవంతంగా పనిచేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా పార్టీలో సమస్య వచ్చినప్పుడూ చాకచక్యంగా పరిష్కరించి గ్రేట్ ట్రబుల్ షూటర్‌గా కూడా హిప్కిన్స్‌కు పేరుంది. ఐతే వచ్చే ఎన్నికల్లో దేశంలోని ఆర్థిక వ్యవస్థ పెద్ద సవాలుగా మారునుంది. ఆయన ఓటర్లను ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలనని చెప్పి ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఇదిలా ఉండగా, జెసిండా పదవీవిరమణ ప్రకటన విషాదంగా అనిపించినా, ఈ ప్రకటన అనంతరం చాలాకాలం తర్వాత తొలిసారి బాగా నిద్రపోయానని ఆమె చెప్పడం విశేషం.
(చదవండి: రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. గాల్లో ఉండగానే..)
Comments
Please login to add a commentAdd a comment