కాట్రెల్, విలియమ్సన్
మాంచెస్టర్: చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ వెస్టిండీస్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి చేరింది. టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిలింది. ఇన్నింగ్స్ తొలిబంతికే గప్టిల్ (0)ను ఔట్ చేసిన కాట్రెల్ ఐదో బంతికి మున్రో (0)ను బౌల్డ్ చేశాడు. రెండో బంతికే క్రీజులోకి వచ్చిన విలియమ్సన్... టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. విలియమ్సన్ (154 బంతుల్లో 148; 14 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత శతకానికి తోడు... టేలర్ (95 బంతుల్లో 69; 7 ఫోర్లు) రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. విండీస్ బౌలర్ కాట్రెల్‌కు 4 వికెట్లు దక్కాయి.
అనూహ్యంగా మ్యాచ్ అటూ ఇటూ..!
292 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ కుప్పకూలింది. 49 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ క్రిస్‌గేల్ (87), సెకండ్ డౌన్ బ్యాట్స్‌మన్ హెట్‌మైర్ (54) రాణించారు. మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. ఓ దశలో 27 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసిన వెస్టిండీస్‌ను మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కార్లోస్ బ్రాత్‌వైట్ 101 (82 బంతులు, 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. చివరి వికెట్‌కు 7 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయాలి. అయితే, 49వ ఓవర్ చివరి బంతిని భారీ సిక్సర్‌గా మలిచి జట్టుకు అనూహ్య విజయాన్నందించాలనుకున్న అతని ఆశ నెరవేరలేదు. నీషమ్ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అతను భారంగా పెలివిలియన్ చేరాడు. దీంతో విండీస్ కథ ముగిసింది. ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి గెలుపు దిశగా వెస్టిండీస్ పయనించడం.. చివర్లో ఓటమి పాలవడం స్టేడియంలో ఉన్న ప్రతిఒక్కరినీ బాధింపజేసింది. ముఖ్యంగా బ్రాత్‌వైట్ పోరాట పటిమకు అందరూ ముగ్ధులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment