ఆసిప్ అలీ, షోయబ్ మాలిక్ మెరుపులు.. పాకిస్తాన్‌కు రెండో విజయం
సమయం 23:00.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో టి20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ను మిడిలార్డర్ బ్యాటర్స్ షోయబ్ మాలిక్(26*), ఆసిఫ్ అలీ(27*) విజయతీరాలకు చేర్చారు. అంతకముందు ఓపెనర్ రిజ్వాన్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోదీ 2, బౌల్ట్, మిచెల్ సాంట్నర్, సౌథీ తలా ఒక వికెట్ తీశారు.
అంతకముందు న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. పాక్ బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్స్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. డెవన్ కాన్వే, డారిల్ మిచెల్ చెరో 27 పరుగులు చేయగా.. కేన్ విలియమ్సన్ 25 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 4 వికెట్లతో చెలరేగగా.. షాహిన్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్ తలా ఒక వికెట్ తీశారు.
సమయం 22:39.. 17 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ 12, ఆసిఫ్ అలీ 17 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఇమాద్ వసీమ్(11) రూపంలో పాక్ ఐదో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో ఇమాద్ ఎల్బీగా వెనుదిరిగాడు.
మహ్మద్ రిజ్వాన్(33) ఔట్.. పాకిస్తాన్ 69/4
సమయం: 22:18.. పాకిస్తాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా ఇష్ సోదీ బౌలింగ్‌లో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(33) ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు మహ్మద్ హఫీజ్(11) మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో డెవన్ కాన్వే అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.
సమయం 22:00.. లక్ష్యచేధనలో పాకిస్తాన్ తడబడతుంది. ఫఖర్ జమాన్(11) రూపంలో పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. రిజ్వాన్ 25, మహ్మద్ హఫీజ్ 6 పరుగులతో ఆడుతున్నారు.
బాబర్ అజమ్ క్లీన్‌బౌల్డ్.. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
సమయం: 21:45.. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బాబర్ అజమ్(9) సౌథీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాగా సౌథీకి టి20ల్లో ఇది 100వ వికెట్ కావడం విశేషం. ప్రస్తుతం 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది.
సమయం: 21:10.. పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. పాక్ బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్స్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. డెవన్ కాన్వే, డారిల్ మిచెల్ చెరో 27 పరుగులు చేయగా.. కేన్ విలియమ్సన్ 25 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 4 వికెట్లతో చెలరేగగా.. షాహిన్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్ తలా ఒక వికెట్ తీశారు.
ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
సమయం: 20:54.. డెవన్ కాన్వే(27) రూపంలో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 13 పరుగులతో ఆడతున్నారు.
సమయం: 20:30.. కెప్టెన్ కేన్ విలియమ్సన్(25) హసన్ అలీ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. రిస్క్ అని తెలిసినప్పటికీ విలియమ్సన్ సింగిల్ కోసం ప్రయత్నించగా.. హసన్ అలీ మెరుపు వేగంతో స్పందించి నేరుగా వికెట్లను గిరాటేయడంతో రనౌట్ అయ్యాడు.
నీషమ్(1) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన కివీస్
సమయం 20: 10.. మహ్మద్ హఫీజ్ బౌలింగ్‌లో ఫకర్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చి జిమ్మీ నీషమ్(2 బంతుల్లో 1) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 9.1 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ 56/3.క్రీజ్లో విలియమ్సన్(14 బంతుల్లో 9), డేవాన్ కాన్వే ఉన్నారు.
సమయం: 20:06.. వేగంగా ఆడుతున్న ఓపెనర్ డారిల్ మిచెల్(27) ఇమాద్ వసీమ్ బౌలింగ్‌లో ఫఖర్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 54 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. విలియమ్సన్ 8, జేమ్స్ నీషమ్ 1 పరుగుతో ఆడుతున్నారు.
గప్టిల్ క్లీన్‌బౌల్డ్.. తొలి వికెట్ కోల్పోయిన కివీస్
సమయం 19:55.. ఓపెనర్ మార్టిన్ గప్టిల్(17) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో గప్టిల్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి కివీస్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. మిచెల్ 19, విలియమ్సన్ 5 పరుగుతో ఆడుతున్నారు.
5 ఓవర్లలో న్యూజిలాండ్ 36/0
సమయం: 19:50.. పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు గప్టిల్ 17, డారిల్ మిచెల్ 18 పరుగులతో ఆడుతున్నారు.
షార్జా: టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా సూపర్ 12 గ్రూఫ్ -2లో పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన పాకిస్తాన్ మంచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుండగా.. మరోవైపు న్యూజిలాండ్ సూపర్ 12 దశలో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఇక టి20ల్లో ముఖాముఖి పోరులో ఇరుజట్లు 24 సార్లు తలపడగా.. 14 సార్లు పాకిస్తాన్ విజయం సాధించగా.. 10సార్లు న్యూజిలాండ్ గెలిచింది. ఇక టి20 ప్రపంచకప్‌లలో ఇరుజట్లు ఐదుసార్లు తలపడగా.. మూడుసార్లు పాకిస్తాన్ గెలవగా.. రెండుసార్లు న్యూజిలాండ్‌ను విజయం వరించింది. 2016 టి20 ప్రపంచకప్‌లో ఆఖరిసారి జరిగిన పోరులో న్యూజిలాండ్ గెలిచింది. కాగా 2009లో పాకిస్తాన్ టి20 ప్రపంచకప్‌ను గెలవగా.. న్యూజిలాండ్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది.
పాకిస్తాన్: బాబర్ అజమ్(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్, షాహిన్ అఫ్రిది
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment