దేశంలో స్టార్టప్‌ల వ్యవస్థను అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియా దేశాల నుంచి అంతర్జాయ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. కెన్యా నేషనల్ ఇన్నోవేషన్ ఏజెన్సీ (కెనియా), టాంజానియా సమాచార, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం ఇక్కడికి చేరుకుంది.
జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) నిధులు సమకూర్చిన రెండు ప్రాజెక్టులను, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC) ద్వారా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్, ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను ప్రతినిధి బృందం సందర్శించింది.
రెండు రోజుల సైట్ సందర్శనలో ప్రతినిధి బృందం సభ్యులు కీలకమైన వాటాదారులతో సంభాషించారు. స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన వినూత్న పరిష్కారాలను అన్వేషించారు. క్షేత్ర స్థాయిలో ఈ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ పాత్ర గురించి తెలుసుకున్నారు.
అలాగే, ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంగ్థనింగ్ ప్రాజెక్ట్ ద్వారా మద్దతిచ్చే టి-హబ్, టి-వర్క్స్, వీ-హబ్ వంటి ఇన్నోవేషన్ ప్రాంగణాలను సందర్శించింది. పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నేతృత్వంలోని భారతదేశపు ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లు స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎలా మద్దతు ఇస్తున్నాయో తెలుసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment