Hyderabad Visit
-
మన స్టార్టప్ వ్యవస్థే ప్రపంచానికి దిక్సూచి..
దేశంలో స్టార్టప్‌ల వ్యవస్థను అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియా దేశాల నుంచి అంతర్జాయ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. కెన్యా నేషనల్ ఇన్నోవేషన్ ఏజెన్సీ (కెనియా), టాంజానియా సమాచార, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం ఇక్కడికి చేరుకుంది.జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) నిధులు సమకూర్చిన రెండు ప్రాజెక్టులను, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC) ద్వారా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్, ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లను ప్రతినిధి బృందం సందర్శించింది.రెండు రోజుల సైట్ సందర్శనలో ప్రతినిధి బృందం సభ్యులు కీలకమైన వాటాదారులతో సంభాషించారు. స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన వినూత్న పరిష్కారాలను అన్వేషించారు. క్షేత్ర స్థాయిలో ఈ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ పాత్ర గురించి తెలుసుకున్నారు.అలాగే, ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంగ్థనింగ్ ప్రాజెక్ట్ ద్వారా మద్దతిచ్చే టి-హబ్, టి-వర్క్స్, వీ-హబ్ వంటి ఇన్నోవేషన్ ప్రాంగణాలను సందర్శించింది. పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నేతృత్వంలోని భారతదేశపు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌లు స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎలా మద్దతు ఇస్తున్నాయో తెలుసుకుంది. -
.. నాకు ఎమర్జెన్సీ గుర్తొస్తుంది!
.. నాకు ఎమర్జెన్సీ గుర్తొస్తుంది! -
తెలంగాణపై విషం కక్కేందుకే మోదీ హైదరాబాద్ వచ్చారు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం వచ్చినట్లు లేదని.. తెలంగాణపై విషం కక్కేందుకే వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. ప్రతి మాట సత్యదూరమని, ప్రధానిగా ఇన్ని అబద్ధాలు చెప్పడం మోదీకే చెల్లిందని విమర్శించారు. రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యిందని.. కానీ పీఎం కిసాన్ వల్లే మొదటిసారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత? అని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్ది దారుల ఖాతాలో జమ అవుతున్నాయి. తన వల్లే డీబీటీ మొదలైనట్టు అనడం పచ్చి అబద్దం. ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముంది?. వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవం. ITIRను బెంగళూరుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మోదీ ప్రభుత్వం కాదా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోదీ చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఈ పరిస్థితి రివర్స్గాగా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదు’ అని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి ‘తెలంగాణ సీఎంకు సరైన సమాచారం ఇవ్వకుండా పరేడ్ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల సభను ఎన్నికల ప్రచార సభగా ప్రధాని మోదీ మార్చారు. ప్రధాని తన ప్రసంగంలో డొల్ల మాటలు మాట్లాడారు. తెలంగాణకు తొమ్మిది ఏళ్లుగా మోదీ ఎలాంటి సహాయం చేయలేదు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చలేదు. ఎయిమ్స్ ప్రకటన చేసిన నాలుగేళ్ళ తర్వాత మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన మోదీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. మెట్రోకు కావాల్సిన నిధులు ఎవరు ఇచ్చారో తెలంగాణ ప్రజలకు తెలుసు. మెట్రో తమ ఘనతగా మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ 28 ప్రాజెక్టులు అడిగితే కేంద్రం ఇచ్చింది కేవలం మూడు ,నాలుగు మాత్రమే. టోల్ రూపంలో 9 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు చెల్లించారు. మోడీ తన ప్రసంగంలో మొత్తం అబద్దాలు మాట్లాడారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వలేదు. అప్పు అడిగినా ఇవ్వలేదు’ అని ఎమ్మెల్సీ మండపడ్డారు. అవార్డులు ఎందుకు ఇస్తోంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రధానికి రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే.. కేవలం తిట్టిపోయారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలపై మంత్రులు విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్ పాలనను ప్రధాని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మోదీకి ఏమీ చేత కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. అభివృద్ధి తట్టుకోలేకే విమర్శలు: మంత్రి జగదీశ్ రెడ్డి రైలు ప్రారంభం పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రధాని నరేంద్ర మోదీ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఆ ప్రంసంగం ఆసాంతం మోసపూరితంగా సాగిందని విమర్శించారు. మోదీ ముఖంలో కేసీఆర్ భయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు మోదీ. భయంతో మోదీ పూర్తి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారు. ప్రధాని తన ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందనడం విడ్డూరంగా ఉంది. ఎందులో అడ్డుకున్నాం.. కేంద్రం పసుపు బోర్డు ఇస్తానంటే అడ్డుకున్నామా?. ‘కేసీఆర్‌ది కుటుంబ పాలన కానేకాదు. ఆయనది ఉద్యమ నేపథ్య కుటుంబం. కేసీఆర్‌కు ప్రజల ఆమోదం ఉంది. -మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి -
హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం..
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. పలు రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, ఎయిమ్స్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం ప్రధాని శనివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళతారు. అక్కడి కార్యక్రమాల తర్వాత పరేడ్‌గ్రౌండ్స్ సభలో పాల్గొంటారు. కొంతకాలం నుంచి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు తీవ్రస్థాయికి చేరడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను ఈడీ విచారించడం, పదో తరగతి పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటన కాక రేపుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడం, మోదీని, బీజేపీని టార్గెట్ చేస్తూ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పెట్టడం, సింగరేణి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించడం అగి్నకి ఆజ్యం పోస్తోంది. ఇక ‘పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు? రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలేమైనా చేస్తారా? కేవలం కేంద్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి ఇచి్చన నిధులు, సాయం వంటి అంశాలకే పరిమితమవుతారా?’ అన్నదానిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ పారీ్టలు కూడా నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. ప్రధాని ప్రసంగంపై ఉత్కంఠ తెలంగాణకు సంబంధించి రూ.11 వేల కోట్ల పైచిలుకు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మోదీ వస్తున్నందున రాజకీయపరమైన అంశాలపై మాట్లాడతారా, లేదా అన్న చర్చ సాగుతోంది. గత ఏడాదిన్నర కాలంలో పలుమార్లు రాష్ట్రానికి వచ్చిన మోదీ.. కొన్నిసార్లు కేసీఆర్‌ను, రాష్ట్రసర్కార్ను ఉద్దేశించి నేరుగా.. మరికొన్ని సార్లు పరోక్షంగా విమర్శలు సంధించారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్‌పై, సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై ఘాటైన విమర్శలు చేస్తారా, లేక గతంలో తరహాలో పరోక్ష విమర్శలు చేస్తారా? బండి సంజయ్ అరెస్టు వంటి అంశాలను ప్రస్తావించి తప్పుపడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ‘ఎఫెక్ట్’ ఉంటుందంటున్న బీజేపీ! కొన్నినెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. మోదీ సభలో తాజా రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని రాష్ట్ర సర్కారు, బీఆర్ఎస్ టార్గెట్ చేయడం వంటివి చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి కాలంలో టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ల లీకేజీ, సంజయ్ అరెస్ట్, మళ్లీ సింగరేణి ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తేవడం, ఢిల్లీ లిక్కర్‌స్కాంలో కవితను ఈడీ విచారించడం వంటి అంశాలను ప్రధాని మోదీ పరోక్షంగానైనా ప్రస్తావించి... తద్వారా బీఆర్ఎస్ పెద్దలకు, రాష్ట్ర బీజేపీకి తగిన సంకేతాలు ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుటుంబ పారీ్టలు, రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా విమర్శించే అవకాశం ఉందని కొందరు నేతలు చెప్తున్నారు. బీజేపీ–బీఆర్ఎస్.. టగ్ ఆఫ్ వార్.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్, బీజేపీ దూకుడు పెంచాయి. దీనితో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఢిల్లీ లిక్కర్ స్కాం అంశాలపై బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీఆర్ఎస్ సర్కారును, కేసీఆర్ కుటుంబాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ కూడా దీటుగా స్పందించి ప్రత్యారోపణలకు దిగింది. పదో తరగతి పేపర్ల లీక్ కేసులో కుట్ర అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు, రిమాండ్‌తో వేడి పెరిగిపోయింది. తాజాగా మోదీ పర్యటన సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి అటు కేంద్రాన్ని, ఇటు బీజేపీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయతి్నస్తోంది. పార్టీ శ్రేణుల్లో దూకుడు పెంచేందుకు కేసీఆర్ సహా కీలక నేతలంతా ప్రయతి్నస్తున్నారు. ఇక ప్రధాని పర్యటనను, సభను విజయవంతం చేసి.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈసారీ కేసీఆర్ దూరమే! దాదాపు ఏడాదిన్నర కాలంలో వివిధ అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ నాలుగుసార్లు రాష్ట్రానికి రాగా.. సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా స్వాగతం పలకడానికి వెళ్లలేదు. ఆయన కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. ఇప్పుడు ఐదోసారి ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎంకు ఆహా్వనం పంపడంతోపాటు బహిరంగ సభలో సీఎం ప్రసంగానికి ఏడు నిమిషాల సమయం కూడా కేటాయించారు. కానీ ఈసారి కూడా ప్రధాని కార్యక్రమాలు, సభలో కేసీఆర్ పాల్గొనడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రధానికి స్వాగతం పలకడానికి మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ను పంపిస్తున్నారు. మోదీ పర్యటన కార్యక్రమాలు ఇవీ.. ⇒ ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు.. 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు.. ⇒ 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు. ⇒ 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. ⇒ మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ⇒ 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు ⇒ 12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం... ⇒ 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్ వీడియోల ప్రదర్శన. ⇒ 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం ⇒ 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం రాక.. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన చేయనున్న మోదీ ► సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభోత్సవం ► ఎంఎంటీఎస్ సరీ్వసుల ప్రారంభం.. మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్ జాతికి అంకితం ..బీబీనగర్ ఎయిమ్స్‌లోపలు పనులకు భూమి పూజ ► పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ► పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగం కాక.. ► రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు ► ప్రధాని మోదీ, బీజేపీని టార్గెట్ చేస్తూ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు.. ► సింగరేణి ప్రాంతాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన ► మోదీ సహా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలపై బీఆర్ఎస్ నేతల విమర్శలు ► తామూ నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్, వామపక్షాల నిర్ణయం చదవండి: మోదీ పర్యటన వేళ.. బీఆర్ఎస్ సరికొత్త ప్రచార అస్త్రం.. ‘ఇదే ఆహ్వానం..’ -
మోదీ పర్యటన వేళ.. బీఆర్ఎస్ సరికొత్త ప్రచార అస్త్రం.. ‘ఇదే ఆహ్వానం..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్ నుంచి పుట్టుకొచ్చి రాష్ట్ర సాధన అనంతరం అధికారంలోకి వచ్చిన పార్టీ టీఆర్ఎస్. రెండు దఫాలు రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని దక్కించుకున్న కె.చంద్రశేఖరరావు మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈక్రమంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) కాస్తా బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) అయింది. ఇప్పటికే కేంద్రంతో పలు అంశాలపై విభేదిస్తూ వచ్చిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి అడుపెట్టడంతో మరింత దూకుడు పెంచారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ అరెస్టుతో రాజకీయంగా మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరస్పర విమర్శలు, కేసులు, ఆరోపణలతో తెలంగాణ రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. అటు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇస్తుండటం ఒక ఎత్తయితే, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలతో సైతం వినూత్నంగా సెటైర్లు వేస్తుండటం గమనార్హం. (చదవండి: సికింద్రాబాద్-తిరుపతి ‘వందే భారత్’ రైలు ప్రత్యేకతలు, టికెట్ ధరలివే!) ఇక ప్రధాని మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ వస్తుండటంతో బీఆర్ఎస్ మరో ప్రచార అస్త్రానికి తెరలేపింది. బీజేపీలోని కీలక నేతల వారసుల ఫోటోలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. కమలం పార్టీ నేతలు పరివారానికే పట్టం కడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు కారు పార్టీ నేతలు. ‘మీ పరివారం మీకు ఆహ్వానం పలుకుతోంది’ అంటూ సెటైరికల్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: కేసీఆర్ వస్తే మోదీ చేతులతో సన్మానం చేయిస్తా: బండి సంజయ్) -
అణచివేతకు గురయ్యే వారిని ప్రేమించాలని చెప్పేవారు
బొల్లోజు రవి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు స్ఫూర్తి ప్రదాత అయిన నిన్నటితరం గెరిల్లా యుద్ధ యోధుడు, మార్క్సిస్టు విప్లవవీరుడు చేగువేరా నేటి యువతరానికీ ఓ ఐకాన్. తండ్రి విప్లవ బాటను నిలువెల్లా నింపుకున్న ఆయన కుమార్తె, మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ అలైదా గువేరా ‘సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం... ప్రపంచ శాంతిని కాపాడుకుందాం’అంటూ ప్రపంచమంతా చాటి చెబుతున్నారు. క్యూబా రాజధాని హవానాలోని విలియం సోలెర్ చిల్ర్డన్స్ హాస్పిటల్లో వైద్యురాలిగా పనిచేçస్తూనే ప్రపంచ దేశాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు ఆమె హాజరవుతుంటారు. క్యూబా సంఘీభావ యాత్రలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న అలైదా గువేరా ఆదివారం తన కుమార్తె, చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరాతో కలసి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ అలైదా గువేరా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నాన్నతో గడిపిన కాలం గుర్తుంది... లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవాన్ని రగిలించేందుకు వెళ్లిన నాన్నను బొలీవియాలో 1967లో అమెరికా అనుకూల బొలివీయా దళాలు కాల్చి చంపినప్పుడు నాకు సుమారు ఏడేళ్లు. అయినప్పటికీ ఆయనతో గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ మెరుపులా గుర్తున్నాయి. ఆయన ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నన్ను లేపేవారు. చెరకు తోటలకు తీసుకెళ్లేవారు. అక్కడ ఆయన పనిచేస్తుంటే నేను చెరకుగడలు తింటూ గడిపేదాన్ని. ఇతరులతో మాట్లాడుతూ నన్ను ఆడిస్తూ ఉండేవారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వీపుపై తిప్పుతూ ఆడించేవారు. నాకు, నా సోదరులకు జంతువుల కథలను ఎక్కువగా చెప్పేవారు. వారాంతాల్లో స్వచ్ఛంద పనులు చేసేవారు. ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న మానవ సమూహాలను ప్రేమించాలని చెప్పేవారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తీసుకెళ్లేవారు. మాకు దూరంగా ఉన్నా ఉత్తరాలు రాసే వారు. మరో తండ్రిలా క్యాస్ట్రో... నాన్న చనిపోయాక క్యూబా కమ్యూనిస్టు పితామహుడు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నేతల్లో ఒకరైన ఫిడేల్ క్యాస్ట్రోనే అన్నీ తానై నన్ను చూసుకున్నారు. క్యాస్ట్రో మరో తండ్రిలాంటి వారు. ఆయనతో కలిసి గడిపిన కాలం ఎంతో ప్రత్యేకం. 1987లో నాకు పెళ్లయింది. పెళ్లి రాత్రి 11:30 గంటలకు జరిగింది. ఆయన రాకకోసం వేచిచూసి ఆ సమయంలో చేసుకున్నాం. నాకు కూతురు పుట్టినప్పుడు ఆయన ఆసుపత్రికి వచ్చారు. విక్టోరియా అనే పేరు పెట్టాలని సూచించారు. కానీ అప్పటికే నేను, మావారు ఒక పేరు నిర్ణయించాం. ఈ విషయం ఆయనకు చెప్పేసరికి కాస్తంత నొచ్చుకున్నారు. పాపను చూసి అమ్మలా నువ్వు ఉండొద్దు (నవ్వుతూ) అని అన్నారు. ప్రపంచానికి మా దేశ వైద్య రంగం ఆదర్శం... క్యూబా వైద్య రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కరోనా కాలంలోనూ వివిధ దేశాలకు వైద్య సాయం చేసింది. ఖతార్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేసే వారంతా క్యూబన్లే. వారికి ఆ దేశం వేతనాలు ఇస్తుంది. హైతీలోనూ ఒక ఆసుపత్రిలో క్యూబన్లు పనిచేస్తున్నా వారికి వేతనాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ దేశం లేదు. అందువల్ల ఖతార్‌లో వచ్చే ఆదాయాన్ని హైతీ ఆసుపత్రుల్లో పనిచేసే క్యూబన్ డాక్టర్లకు చెల్లిస్తున్నాం. అర్జెంటీనాలో స్మారక నేత్ర ఆసుపత్రి, బొలీవియాలో జనరల్ ఆసుపత్రి ఉన్నాయి. కరోనా కాలంలో ఫ్రాన్స్ కూడా క్యూబా వైద్య సాయం కోరింది. ఇటలీ, కెనాడాలకు వైద్య సాయం చేస్తున్నాం. మా దేశంలో చిన్నారులకు 14 రకాల టీకాలు ఇస్తుంటాం. క్యూబాలో ప్రస్తుతం శిశుమరణాల రేటు ప్రతి వెయ్యిలో ఐదుగా ఉంది. క్యూబాలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు.. క్యూబాలో 100 శాతం స్త్రీ, పురుష సమానత్వం ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు. మా దేశంలో మహిళా సంఘం ఉంది. అది అన్ని రకాలుగా మహిళల కోసం పనిచేస్తుంది. చినప్పటి నుంచే బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. పైస్థాయిలోనూ సమాన అవకాశాలు ఉన్నాయి. అందుకే మహిళలు అన్ని రకాలుగా ముందున్నారు. అక్కడి చట్టాలు మహిళల హక్కులు కాపాడతాయి. మహిళా ఉద్యోగులకు ప్రసవానికి ముందు రెండు నెలలు, ప్రసవం తర్వాత 9 నెలలు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఎవరికైనా కూడా అదనపు సెలవులు కావాలంటే మరో మూడు నెలలు 75 శాతం వేతనంతో సెలవు ఇస్తున్నారు. త్వరలో ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేలా కొత్త చట్టం రానుంది. అంతేకాదు ఆరు నెలలు తల్లికి, మరో ఆరు నెలలు తండ్రికి పూర్తి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనుకుంటున్నారు. క్యూబాలో ఇప్పుడు మగవారు కూడా వారికొక సంఘం కోరుకుంటున్నారు (నవ్వుతూ). మా దేశంలో పిల్లలను కొట్టకూడదు. క్యూబా డాక్టర్లలో 72 శాతం మంది మహిళలే. నాన్న కమ్యూనిస్టు... నాన్న చేగువేరా పూర్తి కమ్యూనిస్టు. ఇరాన్ వంటి దేశాల్లోనూ ఆయన్ను ఆరాధిస్తారు. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతంతోనే ఆయన పనిచేశారు. కమ్యూనిస్టుగానే ఆయన చనిపోయారు. క్యూబా ఒకప్పుడు అమెరికా కాలనీగా ఆ దేశ కనుసన్నల్లో బతికింది. 1950లలో విప్లవోద్యమంతో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని పడగొట్టి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక దేశం అన్ని రంగంలో పురోగమించింది. అమెరికాకు ఇది మింగుడు పడడంలేదు. ఇప్పటికీ క్యూబాను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తోంది. పుస్తకం రాస్తున్నా.. నేను నాన్న గురించి ‘చేగువేరా–వైద్యం’అనే పుస్తకం రాస్తున్నా. అందుకోసం నాన్న రాసిన పుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తున్నా. బొలీవియన్ డైరీస్ పుస్తకం చదువుతుంటే గుండె బరువెక్కుతుంది. డైరీ చివరి పేజీ నన్ను కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరి పేజీ ఆయన్ను చంపిన రోజు. ఒక పోరాట యోధుడి డైరీనే బొలివియన్ డైరీ. ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు. చదవండి: అసెంబ్లీ సమావేశాల తర్వాతే.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణ! -
యశ్వంత్ గెలుస్తారనే ఆశాభావం ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతిగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని, భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హా గొప్ప వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. శనివారం జలవిహార్‌లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున హైదరాబాద్‌కు స్వాగతం. భారత రాజకీయాల్లో యశ్వంత్‌సిన్హా గొప్ప వ్యక్తి. న్యాయవాదిగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టి.. అధికారిగా ఆపై రాజకీయ వేత్తగా ఎదిగారు. అధికారిగా, రాజనీతిజ్ఞుడిగా తనను తాను నిరూపించుకున్నారు. తన పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే.. పార్లమెంటేరియన్లంతా ఆత్మ ప్రభోదానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ లాంటి మంచి నేతను ఎన్నుకోవడం అదృష్టం. సమున్నత వ్యక్తిత్వం ఉన్న యశ్వంత్ సిన్హా గెలుస్తారనే నమ్మకం ఉంది. ఆయన గెలవాలని మనసారా కోరుకుంటున్నట్లు.. తద్వారా దేశ గౌరవం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. మోదీపై విసుర్లు ప్రధాని మోదీ రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండబోతున్నారు. రేపు ఆయన సభలో మా గురించి బాగా మాట్లాడబోతున్నారు. విపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేయబోతున్నారు. మోదీ తనను తాను అత్యంత మేధావిగా భావిస్తారు. ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు మాట్లాడతారు. రేపు మోదీ తన ప్రసంగంతో నన్ను చీల్చి చెండాడబోతున్నారు. వ్యక్తిగతంగా ఆయనతో నాకు విబేధాలు లేవు. మీలో ప్రవహించే రక్తంలో కొంతైనా నిజాయితీ ఉంటే.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేరిందా? రైతులు, ఉగ్రవాదులు, వేర్పాటు వాదులుగా కనిపిస్తున్నారా?. రైతులను ఉగ్రవాదులు, ఖలీస్థానీలు అన్నారు. రైతు చట్టాలు సరైనవే అయినప్పుడు వెనక్కి ఎందుకు తీసుకున్నారు?. రైతుల ఆదాయం రెట్టింపు అన్నారు.. అది జరగలేదు. పెట్టుబడులు పెరిగిపోయాయి. దేశం ముందు మీరు(ప్రధాని మోదీని ఉద్దేశించి..) తలదించుకున్నారు. దేశ ప్రజలను తల దించుకునేలా చేశారు. మీ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు ఇలా.. ఏ వర్గం సంతోషంగా లేదు. ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. శ్రీలంకకు వెళ్లినప్పుడు.. ప్రధానిలా కాకుండా సేల్స్‌మ్యాన్‌లా వ్యవహరించారు. మీరు దోషి కాకుంటే రేపటి సభలో సమాధానం ఇవ్వండి. మీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. దేశం నుంచి పెద్ద కంపెనీలు వెళ్లిపోతున్నాయి. మేం మౌనంగా ఉండం.. పోరాటాలు చేస్తాం. ప్రసంగాలు కాదు.. మేం అడిగేవాటికి సమాధానం ఇవ్వాలని సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. -
హైదరాబాద్‌కు యశ్వంత్‌సిన్హా.. ర్యాలీలో సీఎం కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు ఇవాళ నగరం వేదిక అయ్యింది. ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ రాక నేపథ్యంలో.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సైతం నగరంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ సైతం ఈ ప్రచారంలో పాల్గొనడం విశేషం. శనివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్‌సిన్హాకు ఘన స్వాగతం లభించింది. సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జలవిహార్ వరకు జరిగే ర్యాలీలో సిన్హాతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జలవిహార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు గత ఆరునెలలో మూడు సార్లు వచ్చారు. ఏ సందర్భంలోనూ ప్రొటోకాల్ ప్రకారం.. సీఎం కేసీఆర్ ప్రధానికి ఆహ్వానం పలకలేదు. ఈ తరుణంలో.. యశ్వంత్ సిన్హాకు మద్ధతు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆయన వెంట వందల మంది కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో పాల్గొంటుడడం, ప్రచారసభలో ప్రసంగిస్తుండడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లకు దీటుగా నగరం మొత్తం టీఆర్ఎస్ సైతం పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. దీనిపై రగడ నడుస్తోండగా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం టీఆర్ఎస్పై మండిపడ్డారు. Hyderabad | CM's son cannot become CM. BJP is getting stronger, they (TRS) are scared that their chair will go. They're misusing public money to advertise against us. KCR is indulging in digressed politics in Telangana: Union Minister, G Kishan Reddy pic.twitter.com/7zZjCDaNTl — ANI (@ANI) July 2, 2022 -
హైదరాబాద్‌లో మోదీ పర్యటన ఇలా.. షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ ఆ సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే.. ► శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి 2.55 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ► బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 3.20 గంటలకు హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. ► 3.30 గంటలకు హెచ్ఐసీసీకి వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు రిజర్వ్ సమయంగా ఉంచారు. ► సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్‌గా ఉంచారు. ► ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌గా ఉంచారు. ► సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌కు వెళతారు. ► సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు సభలో పాల్గొంటారు. ► రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి.. రాజ్‌భవన్‌కుగానీ, హోటల్కుగానీ చేరుకుని బస చేస్తారు. ► సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. ► ఉదయం 10.10 గంటలకు విజయవాడ చేరుకుని ఏపీలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
HYD: మోదీ పర్యటన.. ఫేస్బుక్లో పోస్ట్ కలకలం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా పాతబస్తీలో మాజిద్ అట్టర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నుపుర్ శర్మ ఘటనపై అట్టర్.. ఫేసుబుక్‌లో పోస్ట్ పెట్టడం కలకలం సృష్టించింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు ఆర్ఎస్ఎస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలని మాజిద్ డిమాండ్ చేశాడు. లేకపోతే నిరసనలకు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చాడు. దీంతో, రంగంలోకి దిగిన మొఘల్‌పురా పోలీసులు మాజిద్ అట్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు. ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. నోవాటెల్, పరేడ్ గ్రౌండ్, రాజ్‌భవన్ పరిసరాల్లో నో ఫ్లైయింగ్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌పై నిషేధం విధించారు. ఇదిలా ఉండగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ జూలై 2న సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా సమావేశం జరిగే హెచ్ఐసీసీ ప్రాంగణానికి వస్తారు. సమావేశం తర్వాత పక్కనే ఉన్న నోవాటెల్ హోటల్లో బసచేస్తారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం 1వ తేదీ నుంచి 3వ తేదీ దాకా ఈ హోటల్ మొత్తాన్ని బుక్ చేశారని హోటల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇది కూడా చదవండి: నోవాటెల్‌లోనే మోదీ బస!