Delegation
-
మన స్టార్టప్ వ్యవస్థే ప్రపంచానికి దిక్సూచి..
దేశంలో స్టార్టప్‌ల వ్యవస్థను అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియా దేశాల నుంచి అంతర్జాయ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. కెన్యా నేషనల్ ఇన్నోవేషన్ ఏజెన్సీ (కెనియా), టాంజానియా సమాచార, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం ఇక్కడికి చేరుకుంది.జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) నిధులు సమకూర్చిన రెండు ప్రాజెక్టులను, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC) ద్వారా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్, ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లను ప్రతినిధి బృందం సందర్శించింది.రెండు రోజుల సైట్ సందర్శనలో ప్రతినిధి బృందం సభ్యులు కీలకమైన వాటాదారులతో సంభాషించారు. స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన వినూత్న పరిష్కారాలను అన్వేషించారు. క్షేత్ర స్థాయిలో ఈ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ పాత్ర గురించి తెలుసుకున్నారు.అలాగే, ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని తెలంగాణ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ స్ట్రెంగ్థనింగ్ ప్రాజెక్ట్ ద్వారా మద్దతిచ్చే టి-హబ్, టి-వర్క్స్, వీ-హబ్ వంటి ఇన్నోవేషన్ ప్రాంగణాలను సందర్శించింది. పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నేతృత్వంలోని భారతదేశపు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌లు స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎలా మద్దతు ఇస్తున్నాయో తెలుసుకుంది. -
రైతు సంక్షేమ కార్యక్రమాలు భేష్
పెనుగంచిప్రోలు: ఏపీలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇథియోపియా ప్రతినిధి బృందం పేర్కొంది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇథియోపియా బృందంలోని ఆరుగురు సభ్యులు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో సాగవుతున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. రైతు పెద్ది మోహనరావుతో మాట్లాడి సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు ఎంతో మేలు కలిగేలా ఉన్నాయన్నారు. ఆంధ్రా రైతులు రకరకాల ఉత్పత్తులు లాభసాటిగా పండిస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఎన్నో రకాల సేవలందిస్తున్నాయని ప్రశంసించారు. ఇక్కడ వ్యవసాయ రంగంలో అమలవుతున్న ప్రతి కార్యక్రమం తమ దేశంలో రైతులకు అందించేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. ఇథియోపియో ప్రతినిధులు రోసి, ఎల్షడే, అబ్రహాం, ఆలీ, ఏడీఆర్ డాక్టర్ జీఎంవీ ప్రసాదరావు, డీడీఈ డాక్టర్ బి.ముకుందరావు, ఏడీ శివప్రసాద్, గరికపాడు కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఆస్ట్రేలియా ఎంపీలు
-
సీఎం జగన్‌ను కలిసిన ఆస్ట్రేలియా ఎంపీలు.. ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: ఆస్ట్రేలియాకు చెందిన ఎంపీల వాణిజ్య ప్రతినిధుల బృందం ఒకటి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా.. ఏపీలో వాణిజ్యంపై ఆసక్తికనబరుస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ప్రశంసలు గుప్పించింది ఆ బృందం. విక్టోరియా స్టేట్ చెందిన లేబర్ పార్టీ ఎంపీలు సీఎం జగన్‌ను కలిశారు. వీరిలో లేజిస్లేటివ్ కౌన్సిల్ ప్రభుత్వ విప్, లెజిస్టేటివ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నారు. ఎనర్జీ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలపై సీఎం జగన్ సర్కార్ చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించింది ఆస్ట్రేలియా ఎంపీల బృందం. శక్తి, విద్య, నైపుణ్యాల అభివృద్ధి రంగాలకు సంబంధించి వరుస చర్చలు జరగ్గా.. సీఎం జగన్‌తో భేటీపై సదరు ఎంపీల ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. పవన, సౌర శక్తి రంగాల కింద ప్రభుత్వం కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉన్నాయని అక్కడి ప్రభుత్వ విప్, ఎంపీ అయిన లీ టర్మలీస్ పేర్కొన్నారు. ఇక్కడ ఏపీలో పవన, సౌరశక్తి పరంగా ప్రభుత్వం చేపట్టిన ఆసక్తికరమైన కార్యక్రమాలు, అభివృద్ధి గురించి నేను వింటున్నాను. ఎనర్జీ, పునరుత్పాదకతపై చర్చించాం. విద్య విధానాల పరంగా.. నైపుణ్యాభివృద్ధి పరంగా మాకు, ఇక్కడి ప్రాంతానికి చాలా సారూప్యతలు ఉన్నాయి. ఒకే దృష్టి ఉంది కాబట్టి.. పరస్పర సహాయం అందించుకుంటాం అని ఎంపీ లీ టర్మలీస్ తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి తన సమయంతో చాలా ఉదారంగా ఉన్నారు. అందువల్లే మా సంభాషణ ఉదారంగా సాగింది. పాఠశాల కార్యక్రమాల కింద ప్రాథమిక మార్పులకు సంబంధించి మేము తీసుకువస్తున్న విధానాలు, మా లక్ష్యాలు ఒకే విధంగా ఉన్నాయి అని డిప్యూటీ స్పీకర్, ఎంపీ మాథ్యూ ఫ్రెగోన్ తెలిపారు. -
రాష్ట్రంలో ‘బోయింగ్’ కార్యకలాపాల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: విమానాల తయారీ సంస్థ ‘బోయింగ్ ఇంటర్నేషనల్’భవిష్యత్తులో రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉన్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది. ఆ సంస్థ అధ్యక్షుడు మైఖేల్ ఆర్థర్, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలిల్ గుప్తే, ఎండీ సురేంద్ర అహుజా, డైరెక్టర్ అశ్వినీ భార్గవ తదితరులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సోమవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ ప్రత్యేకతలతో పాటు, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బోయింగ్ ఇంటర్నేషనల్ బృందంతో కేటీఆర్ చర్చించారు. గత ఐదేళ్లలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. బోయింగ్ సంస్థకు చెందిన టెక్నాలజీ, ఇంజనీరింగ్ డివిజన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇందులో బోయింగ్ సంస్థ కీలకంగా వ్యవహరించాలని కేటీఆర్ కోరారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
దక్షిణ కొరియా బృందంతో మంత్రి గౌతంరెడ్డి భేటీ
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై దక్షిణ కొరియా ప్రతినిధుల బృందంతో వాణిజ్య,సమాచార శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చర్చలు జరిపారు. రాబోయే ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పన రంగాన్ని ప్రభుత్వం ఏవిధంగా అభివృద్ధి చేయానుకుంటుందో బృందానికి వివరించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పాలసీని తీసుకురానున్నామని, త్వరలో రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీల ఏర్పాటుకు సంబంధించిన పాలసీలను విడుదల చేస్తామని అన్నారు. విశాఖలో ఎగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఇక నదులపై అత్యాధునిక హంగులతో ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణ కొరియా బృందం ఆసక్తిని చూపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. -
అమరావతిలో చైనా బృందం పర్యటన
-
శ్రీసిటీని సందర్శించిన తైవాన్ ప్రతినిధుల బృందం
సత్యవేడు: తైవాన్ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సోమవారం శ్రీసిటీని సందర్శించింది. తైవాన్ ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చర్స్ అసోసియేషన్( టీమా) అధ్యక్షుడు ఫ్రాన్సిస్ సయ్ ఆధ్వర్యంలో 20 మంది ప్రతినిధులు శ్రీసిటీకి వచ్చారు. శ్రీసిటీలో ఎలక్ట్రానిక్స్ యూనిట్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధికారిక సర్వే చేయడానికి వచ్చినట్లు బృందం సభ్యులు తెలిపారు. శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధికి ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. టీమా ప్రతినిధులు మొబిల్ట్రాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్, సీఈవో వైసీ కిమ్, ట్యోమ్ ఎలక్ట్రానిక్ వర్క్స్ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్ సామ్యూట్కియో తదితరులు పాల్గొన్నారు. -
రేర్ ఇవెంట్
-
ప్రధానిని కలవనున్న వైయస్ఆర్సిపి బృందం