సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై దక్షిణ కొరియా ప్రతినిధుల బృందంతో వాణిజ్య,సమాచార శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చర్చలు జరిపారు. రాబోయే ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పన రంగాన్ని ప్రభుత్వం ఏవిధంగా అభివృద్ధి చేయానుకుంటుందో బృందానికి వివరించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పాలసీని తీసుకురానున్నామని, త్వరలో రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీల ఏర్పాటుకు సంబంధించిన పాలసీలను విడుదల చేస్తామని అన్నారు. విశాఖలో ఎగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఇక నదులపై అత్యాధునిక హంగులతో ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణ కొరియా బృందం ఆసక్తిని చూపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment