
కెన్యాకు ప్రధాని మోదీ కానుక
కెన్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ 30 అంబులెన్స్లను ఆ దేశానికి కానుకగా ఇచ్చారు.
న్యూఢిల్లీ: కెన్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ 30 అంబులెన్స్లను ఆ దేశానికి కానుకగా ఇచ్చారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ కెన్యా అధ్యక్షుడు ఉతురు కెన్యట్టకు అంబులెన్స్ తాళం చెవులను అప్పగించారు.
భారత్-కెన్యా రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని భారత విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. భారత్కు చెందిన అశోక్ లేలాండ్ తయారు చేసిన ఈ అంబులెన్స్లను కెన్యా రక్షణ బలగాలు ఉపయోగిస్తాయి. మోదీ, కెన్యట్ట నాయకత్వంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అనంతరం నైరోబి యూనివర్శిటీలో మోదీ గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. వర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.