
నైరోబి : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వాలు.. ప్రజలకు నిత్యావసరాలు అందించడం మనం చూశాం. కానీ కెన్యాలో మాత్రం ఆహారపదార్థాలు వంటి నిత్యావసరాలతో పాటుగా మందు బాటిళ్లనూ అందిస్తున్నారు. అల్కహాల్ కాబట్టి శానిటైజర్స్‌లా వాడుతున్నారోమో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ మందుబాటిళ్లు చేతులు కడుక్కోవడానికి కాదు, తాగడానికే. వివిధ రకాల శానిటైజర్లు, సబ్బులు వాడి చేతులు శుభ్రం చేసుకున్నట్లే మందుతో గొంతును శానిటైజ్ చేసుకోవాలట. ఈ విషయం చెప్పింది సాక్షాత్తు ఆ రాష్ర్ట గవర్నర్ మైక్ సోంకో. (కరోనా మళ్లీ మళ్లీ రావచ్చు: డబ్ల్యూహెచ్‌ఓ)
గతవారం జరిగిన మీడియా సమావేశంలో కోవిడ్-19 కేర్ ప్యాకేజీలు (ఆహారం లాంటి నిత్యవసరాలు) లలో మద్యం బాటిళ్లు కూడా పంపిస్తున్నట్లు ప్రకటించారు."ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ ), ఇతర ఆరోగ్య సంస్థలు జరిపిన పరిశోధనల్లో ఆల్కహాల్ వల్ల కరోనా నశిస్తుందని అంచనా వేశారు. నేను కూడా ఇదే విధానాన్ని నమ్ముతున్నాను. అందుకే ప్రజలకు ఇచ్చే ఫుడ్ ప్యాకెట్లలో కొన్ని చిన్న హెన్నెస్సీ (ఆల్కహాల్) బాటిళ్లను అందిస్తున్నాం. "అని గవర్నర్ మైక్ సోంకో పేర్కొన్నారు. (ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్కు ఏమైంది?)
ఫుడ్ ప్యాకెట్లను ఓ వ్యక్తి ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ..ఓ ప్రకటన విడుదల చేసింది. ఆల్కహాల్ వల్ల కరోనా నశిస్తుందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఒకవేళ ఎవరికైనా కరోనా సోకిన వ్యక్తి ఆల్కహాల్ సేవిస్తే మరింత ప్రమాదకరమని హెచ్చరించింది. చైనాలోని వూహాన్‌లో మొట్టమొదటగా వెలుగుచూసిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 22,40,191 మందికి సోకగా, 1,53,822 మంది ప్రాణాలు కోల్పోయారు.
This is wild🤦🏾♂️.
— King of Leon. (@MightiJamie) April 16, 2020
The governor of Nairobi, Kenya @MikeSonko announced that are giving “small bottles of Hennessy” in food packs being distributed to the city’s poor families amid the coronavirus pandemic.
Because Alcohol kills Covid19. Don’t believe me just watch 👇🏾 pic.twitter.com/8IzFWnjdTa