
కెన్యా ‘యూ ట్యూబ్’ త్రోయర్‌కు రజతం
యూ ట్యూబ్‌లో వీడియోలను చూసి ఒలింపిక్స్‌కు సిద్ధమైన కెన్యా జావెలిన్ త్రోయర్ జూలియస్ యెగో రజత పతకాన్ని సాధించాడు.
యూ ట్యూబ్‌లో వీడియోలను చూసి ఒలింపిక్స్‌కు సిద్ధమైన కెన్యా జావెలిన్ త్రోయర్ జూలియస్ యెగో రజత పతకాన్ని సాధించాడు. యెగో జావెలిన్‌ను 88.24 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. థామస్ రోలెర్ (జర్మనీ-90.30 మీటర్లు) స్వర్ణం, వాల్కట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో-85.38 మీటర్లు) కాంస్యం గెలిచారు.