
ముంబై: స్వదేశంలో అద్భుత ఫామ్ కొనసాగించిన భారత ఫుట్‌బాల్ జట్టు ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను చేజిక్కించుకుంది. కెన్యాతో ఆదివారం జరిగిన ఫైనల్లో కెప్టెన్ సునీల్ చెత్రీ డబుల్ గోల్స్ సాయంతో భారత్ 2–0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్ (8వ, 29వ నిమిషాల్లో) చెత్రీనే చేయడం విశేషం. ఈ టోర్నీలో భారత్ తరఫున మొత్తం 11 గోల్స్ నమోదు కాగా... వాటిలో చెత్రీ ఒక్కడే 8 గోల్స్ కొట్టాడు.
మెస్సీ సరసన చెత్రీ...
ఈ మ్యాచ్‌తో చెత్రీ అర్జెంటీనా స్టార్ మెస్సీ సరసన చేరాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీతో జత కట్టాడు. మెస్సీ 124 మ్యాచ్‌ల్లో 64 గోల్స్ చేయగా... చెత్రీ 102 మ్యాచ్‌ల్లోనే 64 గోల్స్ సాధించాడు. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ రొనాల్డో (150 మ్యాచ్‌ల్లో 81 గోల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment