
నేనూ పెరుగుతా..
ఇక్కడున్న పిల్లలు పెరుగుతారు.. అయితే.. వారితోపాటు వాళ్ల కాళ్లకు తగ్గట్లు చెప్పులు కూడా పెరిగితేనో..? ఈ పాదరక్షల గొప్పతనమే అది. ఎలాగంటారా.. ముందు, వెనక, పక్కకు ఉన్న పిన్నుల ద్వారా ఈ చెప్పుల సైజును పెంచుకోవచ్చు.
అమెరికాకు చెందిన కెంటన్ లీ అనే డిజైనర్ కెన్యాలో ఉద్యోగం చేస్తుండగా అక్కడి అనాథ పిల్లలను చెప్పుల్లేకుండా చూసి చలించి పోయాడట.. దీంతో వారికి ఏ విధంగానైనా సహాయం చేయాలన్న కోరిక నుంచి పుట్టిందే ఈ అడ్జస్టబుల్ చెప్పుల ఆలోచన. ఆఫ్రికాలోని పేద, అనాథ పిల్లలకు వీటిని అందించడమే తన లక్ష్యమని లీ చెబుతున్నాడు..