సాక్షి, వెబ్ డెస్క్ : భూ మధ్యరేఖ వెళ్తున్న కెన్యా దేశంలో చేసిన ఓ ప్రయోగం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కెన్యా పర్యటనకు వచ్చిన ఓ విదేశీయుడికి స్థానికులు ఈ ప్రయోగాన్ని చేసి చూపించారు. భూ మధ్యరేఖకు ఉత్తరాన తొలుత ఈ ప్రయోగాన్ని నిర్వహించగా నీటిలో వేసిన పువ్వు కుడి వైపు నుంచి తిరగడం(క్లాక్ వైజ్ డైరెక్షన్) ప్రారంభించింది.
అదే భూ మధ్యరేఖకు దక్షిణాన ఈ ప్రయోగాన్ని నిర్వహించగా నీటిలో వేసిన పువ్వు ఎడమ వైపు నుంచి(యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్) తిరిగింది. అదే సమయంలో కచ్చితంగా భూ మధ్యరేఖ వద్ద ప్రయోగం చేయగా.. పువ్వు కదలకుండా ఉండిపోయింది. దీన్ని చూసిన విదేశీయులు మీరేమైనా మేజిక్ చేశారా? అంటూ నిర్వహికులను ప్రశ్నించగా అదేం లేదని సమాధానమిచ్చారు.
పువ్వు అలా ఎందుకు తిరిగింది?
మూడు సందర్భాల్లో పువ్వులో మార్పులు కనిపించడానికి కారణం భూమికి ఉన్న అయస్కాంత శక్తి. భూ మధ్యరేఖ నుంచి దూరం వెళ్లే కొద్దీ(అంటే ధ్రువాల వైపు ప్రయాణించే కొద్దీ) భూమి అయస్కాంతత్వం పెరుగుతుంది. ధ్రువాల వద్ద దీని విలువ అత్యధికంగా ఉంటుంది. అదే సమయంలో భూ మధ్యరేఖ వద్ద దీని విలువ అతి తక్కువ.
ఈ సూత్రాలనే పైన ప్రయోగానికి అప్లై చేస్తే భూ మధ్య రేఖకు ఉత్తరానికి వెళ్లినప్పుడు భూ అయస్కాంత రేఖలు ఎటువైపు ప్రయాణిస్తున్నాన్నాయో అటువైపే పువ్వు తిరిగింది. అలానే భూ మధ్యరేఖ దక్షిణ ప్రాంతంలో కూడా. ఇదే సమయంలో కచ్చితంగా భూ మధ్యరేఖపై ప్రయోగం చేయడం వల్ల ఎలాంటి బలాలు పువ్వుపై పని చేయకపోవడంతో అది ఎటూ కదల లేదు.
Comments
Please login to add a commentAdd a comment