గోహత్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం నాగపూర్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నాగపూర్: గోహత్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం నాగపూర్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కెన్యా దేశంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఆవుల రక్తం తాగుతారు కానీ వాటిని వధించరని అన్నారు. ఆఫ్రికాలో గోహత్యలపై నిషేధం ఉన్నందున ప్రజలు ఆవులను చంపరనీ.. కానీ కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రం ప్రాణానికి హాని కలుగకుండా ఆవుల మెడ భాగంలోని రక్తనాళం నుండి రక్తాన్ని తీసుకొని తాగుతారన్నారు. పలు రాష్ట్రాల్లో గోవధపై నిషేధం విధించాలన్న డిమాండ్ల నేపథ్యంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.