తీవ్రవాదుల కాల్పులు : 14 మంది మృతి | 14 die in Kenya terror attack | Sakshi
Sakshi News home page

తీవ్రవాదుల కాల్పులు : 14 మంది మృతి

Published Tue, Jul 7 2015 11:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

కెన్యాలోని మండెరా కౌంటీలో అల్ షబాబ్ తీవ్రవాదులు మంగళవారం రెచ్చిపోయారు.

నైరోబి : కెన్యాలోని మండెరా కౌంటీలో అల్ షబాబ్ తీవ్రవాదులు మంగళవారం రెచ్చిపోయారు. స్థానిక మార్కెట్ సమీపంలో ఉన్న ప్రజలపైకి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులు పోలీసు ముఖ్య కార్యాలయానికి అందజేశారు. మండెరా కౌంటీలో అల్ షబాబ్ తీవ్రవాదులు దాడులు నిత్యకృత్యమైనాయి. గతంలో ఈ సంస్థకు చెందిన తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో దాదాపు 200 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement