
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీ పీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి, కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగాలకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ..శక్తిని ప్రసాదించే తిరుమల క్షేత్రంలో అనేక అవకతవకలు, ఆరోపణలు రావడం చాలా బాధాకరమన్నారు. అధికారులు, అర్చకులు, పాలక వర్గాల మధ్య సమన్వయ లోపమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. వెంటనే టీటీడీపై వస్తోన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. లేకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.
కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగా మాట్లాడుతూ..హిందూమతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పర్యటన బాగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. తనకు సరైన ఆతిధ్యం ఇచ్చినందుకు భారతదేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. రైలా ఓడింగా 2008 నుంచి 2013 మధ్య కెన్యా ప్రధానిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment