మన భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం భర్త చనిపోయిన స్త్రీ పలు పండుగలను జరుపుకోనివ్వకుండా నిషేధాలు ఉండేవి. వారు నలుగురుతో కలిసి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. కనీసం చూడటానికి కూడా ఉండేది కాదు. చెప్పాలంటే నాలుగు గోడల మధ్యనే బంధించేసేవారు. వారికి కావాల్సినవి తీసుకొచ్చి వారి గది బయటపెడితే తీసుకోవాలి అంతే. ఎవ్వరికీ కనిపించను కూడా కనిపంచకూడదు. అంత దారుణమైన గడ్డు పరిస్థితుల్లో జీవించేవారు నాటి వితంతువులు. ఇప్పుడిప్పుడే కొంచె వారిని మంచిగానే చూస్తున్నా..కొన్ని విషయాల్లో వారి పట్ల అమానుషంగానే ప్రవర్తిస్తున్నారు. వాళ్లు ఇలాంటి హోలీ పర్వదినం రోజున బయటకు అస్సలు రాకూడదు, రంగులు జల్లుకోకూడదట. వారికోసం ఓ ఎన్జీవో ముందుకోచ్చి సుప్రీం కోర్టులో పోరాడి మరీ వారు కూడా సెలబ్రేట్ చేసుకునేలా చేసింది. ఈ కథ ఎక్కడ జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోlr వింతతు స్త్రీలను మాత్రం రంగుల హోలీలో పాల్గొనిచ్చేవారు కాదు. అస్సలు వారు సెలబ్రేట్ చేసుకోకూడదని నిషేధం విధించారు అక్కడి పెద్దలు. తెల్లటి చీరతో ఉండేవారికి సంతోషానికి ప్రతీకలైన రంగులను ముట్టకూదని కట్టుదిట్టమైన ఆంక్షాలు ఉండేవి. పితృస్వామ్య నిబంధనలు గట్టిగా రాజ్యమేలుతున్న ఆ బృందావన్‌లో వారి స్థితి అత్యంత కడు దయనీయంగా ఉండేది. వారి జీవితాలలో వెలుగు నింపేందుకు ఎన్జీవ్ సులభ్ ఇంటర్నేషన్‌ల అనే స్వచ్ఛంద సంస్థ మార్పుకు నాంది పలికింది. ఆ ఎన్జీవో మహిళా సాధికారత, సామాజిక సమ్మేళనం వంటి వాటికి ప్రసిద్ధి చెందింది.
ఆ స్వచ్ఛంద సంస్థ ఇలాంటి నిబంధనలను తొలగించి వారుకూడా అందరిలా పండుగలను చేసుకునేలా చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించి మరీ వారికి సామాజిక కట్టుబాట్ల నుంచి విముక్తి కలిగించింది. అయినప్పటికీ ఆ వితంతువులు పండుగ చేసుకోవడం చాలా సవాలుగా ఉండేది. సరిగ్గా 2012 నుంచి వారంతా కూడా ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభమయ్యింది. అప్పటి నుంచే ప్రతి ఏటా ఈ హోలీ రోజున వారంతా కృష్ణుని సమక్షంలో ఆడి పాడి వేడుకగా చేసుకుంటున్నారు.
అంతేగాదు ఈ ఒక్క పండుగే గాక దీపావళి వంటి ఇతర అన్ని పండుగలు చేసుకునేలా స్వేచ్ఛను పొందారు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పండుగలకు దూరమై ఉన్న ఆ వితంతువులను ధైర్యంగా అడుగు వేసి, తాము సాటి మనుషులమే ఇది తమ హక్కు అని వారికి గుర్తు చేసింది ఆ స్వచ్ఛంద సంస్థ. ఆ వితంతువులు ఈ హోలీని స్త్రీ ద్వేషం, పితృస్వామ్య నిబంధనలపై విజయం సాధించి, పొందిన స్వేచ్ఛకు గుర్తుగా సంతోషభరితంగా చేసుకుంటారు ఆ వితంతువులు. చెప్పాలంటే ఇది అసలైన హోలీ వేడుక అని చెప్పొచ్చు కథ!
(చదవండి: రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment