లక్నో : మధుర జిల్లాలోని బృందావన్ నగర్ పాలిక్ పరిషత్తు, బార్సానా నగర్ పంచాయత్‌లను పవిత్ర తీర్థ ప్రాంతాలకు ప్రకటిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల్లో మాంసం, లిక్కర్ అమ్మకాలను జరుపకూడదని, వీటిని నిషేధిస్తున్నట్టు శుక్రవారం పేర్కొంది. బృందావన్ ప్రాంతం కృష్ణ భగవానుడి, ఆయన పెద్ద సోదరుడు బలరామ్ జన్మస్థలం కాగ, బార్సానాలో రాధ జన్మించినట్టు ఆధారాలున్నాయి. బృందావన్ కృష్ణుడి జన్మించిన స్థలం కావడంతో, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించింది. ఈ ప్రాంతాలను లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.
పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని, టూరిజంను మరింత అభివృద్ధి చేయడం కోసం వీటిని పవిత్ర యాత్రికుల స్థలాలుగా యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు, స్థానికులకు మంచి వసతులను కల్పించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు ప్రాంతాల్లో మాంసం, మద్యం అమ్మకాలను జరుపకూడదంటూ టూరిజం, మతపరమైన వ్యవహారాల చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment