Barsana
-
అవి పవిత్ర స్థలాలు : మద్యం, మాంసం నిషేధం
లక్నో : మధుర జిల్లాలోని బృందావన్ నగర్ పాలిక్ పరిషత్తు, బార్సానా నగర్ పంచాయత్లను పవిత్ర తీర్థ ప్రాంతాలకు ప్రకటిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల్లో మాంసం, లిక్కర్ అమ్మకాలను జరుపకూడదని, వీటిని నిషేధిస్తున్నట్టు శుక్రవారం పేర్కొంది. బృందావన్ ప్రాంతం కృష్ణ భగవానుడి, ఆయన పెద్ద సోదరుడు బలరామ్ జన్మస్థలం కాగ, బార్సానాలో రాధ జన్మించినట్టు ఆధారాలున్నాయి. బృందావన్ కృష్ణుడి జన్మించిన స్థలం కావడంతో, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించింది. ఈ ప్రాంతాలను లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని, టూరిజంను మరింత అభివృద్ధి చేయడం కోసం వీటిని పవిత్ర యాత్రికుల స్థలాలుగా యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు, స్థానికులకు మంచి వసతులను కల్పించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు ప్రాంతాల్లో మాంసం, మద్యం అమ్మకాలను జరుపకూడదంటూ టూరిజం, మతపరమైన వ్యవహారాల చీఫ్ సెక్రటరీ అవనీష్ అవస్తి చెప్పారు. -
'యువతులు జీన్ ప్యాంట్ ధరించవద్దు'
జీన్స్ ప్యాంట్ ధరించవద్దంటూ యువతులకు ఓ మహా పంచాయతీ హుకుం జారీ చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.జీన్స్ ప్యాంట్ వేసుకున్నారా మీకు శిక్ష తప్పదంటూ హెచ్చరించింది.మధుర సమీపంలోని బరసనలో మహాపంచాయతీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.రెండు రోజుల క్రితం మహా పంచాయతీ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం ఆ మహాపంచాయతీ పూజారీ రాం ప్రసాద్ ప్రజలకు చదవి వినిపించారు. అయితే యువతులు జీన్ ప్యాంట్ వేసుకోవదంటూ పంచాయతీ తీర్మానం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. యువతలు వారికి ఇష్టమైన దుస్తులు వేసుకునే సౌకర్యం కూడా వారికి లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.మరి కొంత మంది మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు. మహా పంచాయతీ తీర్మానాలను అతిక్రమిస్తే జరిమాన విధిస్తామని కూడా ప్రకటించింది. రెండు రోజుల క్రితం జరిగిన ఆ సమావేశానికి మహా పంచాయతీ పరిధిలోని 52 గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.