'యువతులు జీన్ ప్యాంట్ ధరించవద్దు' | No jeans for girls, says Mahapanchayat | Sakshi
Sakshi News home page

'యువతులు జీన్ ప్యాంట్ ధరించవద్దు'

Published Wed, Mar 26 2014 12:52 PM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM

'యువతులు జీన్ ప్యాంట్ ధరించవద్దు'

'యువతులు జీన్ ప్యాంట్ ధరించవద్దు'

జీన్స్ ప్యాంట్ ధరించవద్దంటూ యువతులకు ఓ మహా పంచాయతీ హుకుం జారీ చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.జీన్స్ ప్యాంట్ వేసుకున్నారా మీకు శిక్ష తప్పదంటూ హెచ్చరించింది.మధుర సమీపంలోని బరసనలో మహాపంచాయతీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.రెండు రోజుల క్రితం మహా పంచాయతీ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం ఆ మహాపంచాయతీ పూజారీ రాం ప్రసాద్ ప్రజలకు చదవి వినిపించారు.

అయితే యువతులు జీన్ ప్యాంట్ వేసుకోవదంటూ పంచాయతీ తీర్మానం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. యువతలు వారికి ఇష్టమైన దుస్తులు వేసుకునే సౌకర్యం కూడా వారికి లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.మరి కొంత మంది మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు. మహా పంచాయతీ తీర్మానాలను అతిక్రమిస్తే జరిమాన విధిస్తామని కూడా ప్రకటించింది. రెండు రోజుల క్రితం జరిగిన ఆ సమావేశానికి మహా పంచాయతీ పరిధిలోని 52 గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో  హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement