
పాతిక సంవత్సరాలు బ్యాంకర్‌గా పనిచేసిన ముంబైకి చెందిన మధురా దాస్ గుప్తా సిన్హా ఉద్యోగమే జీవితం అనుకోలేదు. ఇతర మహిళల జీవితాల గురించి ఆలోచించింది. ప్రసవం తరువాత దాస్ గుప్తా స్నేహితురాలు ఉద్యోగ విరామం తీసుకుంది. ఆమె ఉన్నత విద్యావంతురాలు. కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగ విరామం అలాగే ఉండిపోయింది
‘పెళ్లయిన తరువాత ఉద్యోగం ఎందుకు?’ అనే భావనతో ఒక యువతి తన ఉద్యోగానికి రాజీనామా చేసింది... ఇలాంటి సంఘటనలు మధురా దాస్ గుప్తాను లోతుగా ఆలోచించేలా చేశాయి.‘యాస్పైర్ ఫర్ హర్’ అనే సంస్థనుప్రారంభించేలా చేశాయి.
భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గడాన్ని దృష్టిలో పెట్టుకొని ‘యాస్పైర్ ఫర్ హర్’కు శ్రీకారం చుట్టింది మధురా దాస్ గుప్తా. మెంటార్‌షిప్, స్కిలింగ్, రోల్‌మోడల్స్, నెట్‌వర్కింగ్ ద్వారా మహిళలు శ్రామిక శక్తిలోకి వచ్చేలా ప్రేరేపించడానికి ఉద్దేశించిన కమ్యూనిటీ ఆధారిత వేదిక ఇది. 2030 నాటికి పది మిలియన్‌ల మంది మహిళలను శ్రామిక శక్తిలో చేర్చే లక్ష్యంతో ‘యాస్పైర్ ఫర్ ఉమెన్’ పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment