
మథుర: వివాదాస్పద కృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా వివాదంలో మథుర జిల్లా కోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలని జిల్లా సీనియర్ డివిజన్(3) సివిల్ జడ్జీ సోనికా వర్మ ఉత్తర్వులిచ్చారు. జనవరి 20వ తేదీలోగా సర్వే నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
ఇక్కడి ఖాత్రా కేశవ్ దేవ్ ఆలయాన్ని ఔరంగజేబు నేలమట్టంచేసి ఈద్గాను నిర్మించారంటూ పిటిషనర్లు ఈ దావా వేశారు. శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్టు అధీనంలోని 13.37 ఎకరాల స్థలంలోనే ఈ ఈద్గాను నిర్మించారని దీనిని వేరే చోటుకు తరలించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే, ఈ వివాదంపై శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహీ మసీద్ ఈద్గాల మధ్య 1968 ఏడాదిలో కుదిరిన రాజీ ఒప్పందాన్నీ వారు సవాల్‌చేస్తున్నట్లు వారి లాయర్ శైలేశ్ దూబే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment