లక్నో: వారణాసి జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు సర్వే(ఏఎస్‌ఐ Archaeological Survey of India) చేపట్టిన సర్వే పూర్తైంది. అయితే.. నివేదికను సమర్పించేందుకు ఏఎస్‌ఐ గడువు కోరడంతో నవంబర్ 17వ తేదీదాకా వారణాసి కోర్టు సమయం ఇచ్చింది.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వడానికి భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ)కు వారణాసి కోర్టు మరింత గడువిచ్చింది. ఈ నెల 17 వరకు సమయమిస్తూ జిల్లా న్యాయమూర్తి కే విశ్వేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సర్వేకు ఉపయోగించిన పరికరాల వివరాలతో పాటు సర్వే నివేదికను పూర్తిస్థాయిలో సిద్దం చేసేందుకు టైం కోరిందని, అందుకు కోర్టు అంగీకరించిందని ప్రభుత్వ న్యాయవాది అమిత్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 5వ తేదీన జ్ఞానవాపి సర్వే కోసం నాలుగు వారాల గడువు ఇచ్చిన వారణాసి కోర్టు.. తర్వాత ఎలాంటి గడువు ఉండబోదని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు.. సైంటిఫిక్ సర్వేపై సుప్రీం కోర్టు
Comments
Please login to add a commentAdd a comment