Bus Hijack
-
భార్యను రక్షించడం కోసం పోలీసులకే కట్టుకథ
మథురై : ఉత్తరప్రదేశ్‌లోని మధుర జనపథ్ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు సోమవారం రాత్రి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. మా బస్సు హైజాక్‌కు గురైందని.. వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడాలంటూ సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అక్కడికి చేరుకొని బస్సును ఆపారు. అయితే అసలు విషయం తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాలు.. మథురై నుంచి బస్సులో వెళ్తున్న మహిళా ప్రయాణికురాలు నౌహ్జీల్ పరిధిలోని బజ్నాకు చేరుకునేసరికి ఒక ప్రయాణికునిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన భర్తకు ఫోను చేసింది. తనను అనుమానంగా చూస్తున్నాడని.. భయమేస్తుందని భర్తకు చెప్పింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫోను చేసి, బస్సు హైజాక్ అయిందంటూ కట్టుకథ అల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తన భార్యను రక్షించుకోవడం కోసం బస్సు హైజాక్ అయిందంటూ నాటకమాడిన సదరు వ్యక్తిని చట్ట నియమాలను ఉల్లఘించినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(చదవండి : ప్రకాశం బ్యారేజీలో దూకి యువకుడు ఆత్మహత్య) -
స్కూల్ బస్సు హైజాక్.. ఆపై నిప్పు
రోమ్: ఇటలీలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ 51 మంది పిల్లలున్న బస్సును హైజాక్ చేసి బస్సుతోపాటు వాళ్లందరినీ తగులబెట్టాలని చూశాడు. అదృష్టవశాత్తూ పోలీసులకు సమాచారం అంది వారు వచ్చి మంటల్లో చిక్కుకున్న పిల్లలందర్నీ రక్షించగలిగారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీలోకి వలస వస్తున్న వారిపై ఇటలీ ఉప ప్రధానుల వైఖరికి నిరసనగా ఈ పని చేసినట్లు ఆ డ్రైవర్ చెప్పాడు. ‘మధ్యధరా సముద్రంలో ఎంతో మంది చనిపోతున్నారనీ, ఈ రోజు మీరు∙చావబోతున్నారు’ అని అతను విద్యార్థులతో అన్నాడు. 51 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది ఓ క్రీడా వేదికకు వెళ్లొస్తుండగా డ్రైవర్ ఈ హైజాక్‌కు పాల్పడ్డాడు. 30 నిమిషాలపాటు వారిని తన బందీలుగా ఉంచుకున్నాడు. వెంట తెచ్చిన పెట్రోల్‌ను బస్‌పై పోసి నిప్పంటించాడు. ఓ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి హైజాక్ విషయం చెప్పడం, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్వరమే పోలీసులు అక్కడకు చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి అందరినీ రక్షించారు. -
రుణం చెల్లించనందుకు బస్సు ‘హైజాక్’!
సాక్షి, బెంగళూరు: తీసుకున్న రుణం చెల్లించనందుకు ఓ సంస్థకు చెందిన బస్సును ప్రయాణికులు ఉండగానే ఫైనాన్స్ సిబ్బంది హైజాక్ చేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి కేరళకు 42 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సును ఆర్.ఆర్.నగర్లో శుక్రవారం రాత్రి రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు అడ్డుకున్నారు. తాము పోలీసులమనీ, తనిఖీలు చేయాలంటూ ప్రయాణికులతో సహా బస్సును సమీపంలోని గోడౌన్‌కు తరలించారు. అనంతరం అక్కడకు మరో ఏడుగురు చేరుకున్నారు. గోడౌన్‌కు తాళం వేసి బస్సును కదలకుండా చేశారు. దీంతో భయపడ్డ ప్రయాణికులు కొందరు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను చూసిన దుండగులు అక్కడ్నుంచి పరారయ్యేందుకు యత్నించారు. దీంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. బస్సు కొనుగోలు సమయంలో ఇచ్చిన అప్పును యజమాని తిరిగిచెల్లించకపోవడంతో సదరు ఫైనాన్సింగ్ సంస్థ ఈ నిర్వాకానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు. -
బస్సును హైజాక్ చేసి నిప్పంటించారు
బీజింగ్: చైనాలోని వాయవ్య ప్రాంతం షాంఝి ప్రావిన్స్‌లో దుండగులు ఓ బస్సును హైజాక్ చేసి నిప్పంటించారు. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ఎనిమిదిమంది మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. షాంఝి రాజధాని ఝియన్ నగరంలో ఫుజోవ్-యించ్వాన్ హైవేపై ఓ టన్నెల్ వద్ద ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఇంతకు మంచి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఇది ఉగ్రవాద చర్యా లేక తిరుగుబాటుదారుల చర్యా అన్న విషయం తెలియరాలేదు. -
హైజాక్ ఇతివృత్తంగా బస్ 657
హైజాక్ నేపథ్యంగా ఇంతకు ముందు పలు భాషల్లో పలు చిత్రాలు తెరపైకొచ్చి ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేశాయి. తాజాగా బస్ 657 పేరుతో హాలీవుడ్ చిత్రం రానుంది. ఇది అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందింది. ఇంతకు ముందు టోర్నమెంట్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన స్కాట్మన్ ఈ బస్ 657 చిత్రానికి సృష్టి కర్త. ఇంపాజిబుల్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం బస్ హైజాక్ ఇతి వృత్తంతో రూపొందింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన కూతుర్ని రక్షించుకోవడానికి డబ్బు కోసం ఓ తండ్రి తన సహచరుడితో కలిసి ఒక బస్‌ను హైజాక్ చేస్తాడు. ఈ నేపథ్యంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారంగా బస్ 657 చిత్రం ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ఇందులో జఫ్రీడిన్ మార్గన్, క్యాట్ బోస్వర్త్, మోరిస్చెస్ట్నట్ ప్రధాన పాత్రలు పోషించారు.చిత్రం మార్చి 11న దేశ వ్యాప్తంగా ఆంగ్లం,తమిళం,తెలుగు భాషల్లో విడుదల కానుంది.