బీమా వ్యాపారంలో మోసపూరిత కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐఆర్‌డీఏ ప్రజలను
న్యూఢిల్లీ: బీమా వ్యాపారంలో మోసపూరిత కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐఆర్‌డీఏ ప్రజలను హెచ్చరించింది. దీనికి సంబంధించి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఐఆర్‌డీఏ ఆధ్వర్యంలో అధిక రాబడులు వచ్చే బీమా పాలసీలు ఉన్నాయని, బోనస్‌లు ఇస్తోందంటూ ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, ఐఆర్‌డీఏ బీమా వ్యాపారంలో లేదని ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రజలెవరైనా ఇలాంటి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటే, తక్షణం సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొంది.