శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ వచ్చింది.
శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ సిబ్బంది వెంటనే అక్కడ తనిఖీలు మొదలుపెట్టారు. గతంలో కూడా ఈ విమానాశ్రయానికి ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వచ్చాయి. వాటి విషయంలో కూడా సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తమై పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు.
అంతకుముందు ఈనెల 13వతేదీ గురువారం నాడు హైకోర్టుకు కూడా ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. హైకోర్టులో నాలుగు బాంబులున్నాయని, అవి ఏ క్షణమైనా పేలవచ్చునంటూ ఓ ఆగంతకుడు పోలీసు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. కానీ అది ఉత్తుత్తి బెదిరింపేనని తర్వాత తేలింది.