Telangana Government Names New Secretariat As Dr BR Ambedkar - Sakshi
Sakshi News home page

TS New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు

Published Thu, Sep 15 2022 3:32 PM | Last Updated on Thu, Sep 15 2022 4:39 PM

Telangana Government Names New Secretariat As Dr BR Ambedkar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు.

సచివాలయానికి అంబేద్కర్‌ నామకరణం.. తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. అంబేద్కర్‌ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికి ఆదర్శమని కొనియాడారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు. పార్లమెంట్‌ కొత్త భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు.
చదవండి: మంత్రి vs సిట్టింగ్‌ ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement