
సాక్షి, హైదరాబాద్ : నూతన సచివాలయ భవన నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం శంకుస్థాపన చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో సచివాలయంలోని డీ–బ్లాక్ వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులో కొత్త భవన నిర్మాణానికి కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీఛైర్మన్లు హాజరయ్యారు. రూ. 400 కోట్లతో నూతన సచివాలయ భవన నిర్మాణం జరగనుంది.
అనంతరం ఎర్రమంజిల్ ప్యాలెస్, ఆర్‌అండ్‌బీ కార్యాలయ భవన సముదాయం మధ్య ఖాళీ స్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 100కోట్లతో తెలంగాణ అసెంబ్లీ భవన నిర్మాణం జరగనుంది. చరిత్రాత్మక ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment