
సాక్షి, హైదరాబాద్ : లోన్ సురక్ష విస్తరణ కార్యక్రమం సేవలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం సచివాలయంలో ప్రారంభించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రుణాలు పొందిన మహిళలు దురదృష్టవశాత్తు మరణిస్తే బీమా సొమ్ము నుంచే చెల్లించేందుకు లోన్ సురక్ష ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో పాటు అత్యవసర సహాయం కింద మరణించిన మహిళ కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా స్త్రీ నిధి కరదీపిక, స్నేహ అవగాహన బ్రోచర్లతో పాటు ఉపాధిహామీ వార్షిక నివేదికను మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు.