
సాక్షి, హైదరాబాద్ : కొత్త సచివాలయం భవన సముదాయం నిర్మాణానికి రూ.400 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు జారీచేసింది. చెన్నైకు చెందిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ రూపకల్పన చేసిన కొత్త సచివాలయం భవన డిజై¯Œ ను ఆమోదించడంతో పాటు కొత్త సచివాలయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయం నిర్మాణానికి మూడు రోజుల క్రితం పరిపాలనా అనుమతులను సాధారణ పరిపాలన శాఖ జారీచేసింది. సచివాలయం నిర్మాణం కోసం మరో వారం రోజుల్లో గ్లోబల్ టెండర్లను పిలవనున్నారు. నెలాఖరులోగా పనులను ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా సచివాలయం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తైంది. శిథిలాల తరలింపు ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. మరో వారం లేదా పదిరోజుల్లోగా శిథిలాల తరలింపు పూర్తి చేసి, కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా మొత్తం స్థలాన్ని చదును చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment