కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం.. కేసీఆర్‌పై ఫైర్‌ | Congress MLA Seethakka Serious Comments On KCR Goverment | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం.. కేసీఆర్‌పై ఫైర్‌

Published Fri, Oct 6 2023 7:53 PM | Last Updated on Fri, Oct 6 2023 8:14 PM

Congress MLA Seethakka Serious Comments On KCR Goverment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్బంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ పనుల కోసం నేను సచివాలయానికి వెళ్తుంటే అనుమతి లేదని ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నట్టు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన పనులపై తాను సచివాలయానికి వచ్చానని, లోపలికి వెళ్తుంటే పోలీసులు తనను అడ్డుకుని ఆవేదన ‍వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా చూపిస్తోందని, కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోనికి ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. ఇది చాలా అవమానమని, దీనిపై తాను ఏదైనా చేయవచ్చు కానీ.. అలా చేయడం తనకు ఇష్టం లేదన్నారు. 

నేను ప్రజా సమస్యలపై ఇక్కడకు వచ్చానన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చేది ఉండదని, పైగా వచ్చే వాళ్లను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారన్నారని ఆరోపించారు. సచివాలయం కేవలం బీఆర్ఎస్ నేతలకేనా? అని నిలదీశారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండి అని చురకలు అంటించారు. హోంమంత్రిగా ఉండి గన్‌మెన్లను కొట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులకు పౌరుషం రావాలని, హోంమంత్రి వెంటనే సంబంధిత గన్‌మెన్‌కు క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: ప్లీజ్‌ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement