సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన కొత్త సచివాలయానికి లైన్‌క్లియర్ అయ్యింది. నూతన సచివాలయానికి గురువారం కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరుచేసింది. రూ.400 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను ఇటీవల జారీచేసిన విషయం తెలిసిందే. చెన్నైకు చెందిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ ఈ భవన సముదాయానికి రూపకల్పన చేసింది. కాగా సచివాలయం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే పూర్తి అవ్వగా దాని స్థానంలో కొత్త భవనాలను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని కొరకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment