ప్రస్తుతానికి కూల్చివేత ఆపండి: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ తదుపరి విచారణను ఉమ్మడి హైకోర్టు 10రోజులకు వాయిదా వేసింది. దీనిపై 10 రోజుల గడువులోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆ పిటిషన్ విచారించిన హైకోర్టు కేసు తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేస్తూ.. అప్పటివరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టేంతవరకు పరిపాలనా వ్యవహారాలకు విఘాతం తలెత్తకుండా చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయం నిర్మించేవరకూ ఏపీ భవనాలను తాత్కాలిక సచివాలయంగా వినియోగించుకోవాలని టీసర్కార్ యోచిస్తోంది.