నాగం జనార్థన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసందే. పిటిషన్‌పై జనార్థన్ రెడ్డికి గురువారం హైకోర్టులో ఊరట లభించింది. నాగంకు భద్రత పునరుద్ధరించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనకు గన్‌మెన్‌లను తొలగించడంపై నాగం హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే గన్‌మెన్‌లను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాని హైకోర్టు ఆదేశాలు పంపింది.
ఆయన అధికార టీఆర్‌ఎస్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు గతంలో ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment