
సాక్షి, అమరావతి: ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలు అచ్చేయడంలో తనకు తానే సాటి అని ‘ఈనాడు’ రామోజీరావు మరోసారి నిరూపించుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమతుల అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే వెనుకబడిన రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు.
ఫలితంగా మునుపెన్నడూ లేని రీతిలో ఈ ప్రాంతం అభివృద్ధిలో పురోగమిస్తోంది. దీన్ని ఇప్పుడు రామోజీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే.. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలను నిత్యం వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని విషం కక్కుతున్నారు. వాటిని అపహాస్యం చేస్తూ.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి కొన్ని రాజకీయ శక్తులతో కలిసి ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ‘కరవు నేలపై కనికట్టు మాటలు’ శీర్షికన మంగళవారం ఈనాడులో అచ్చోసిన అబద్ధాల సమాహారం.
సీమ పచ్చబడుతుంటే ఎందుకంత కడుపుమంట?..
♦ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ తదితర ప్రాజెక్టులను చేపట్టారు. ఈ ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను టీడీపీ సర్కార్ పూర్తిచేయలేదు. పైగా.. ఆ పనుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. నామినేషన్‌పై అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. ప్రభుత్వ ఖజానాను చంద్రబాబు ఇలా దోచుకోవడంపై రామోజీరావు పెన్ను ఎప్పుడూ కదల్లేదు.. నోరు పెగల్లేదు. ఎందుకంటే.. అలా దోచుకుని, పంచుకుని, తిన్న దాంట్లో ఆయనకూ వాటా వచ్చిం ది కాబట్టి. కానీ, జగన్ ఈ ప్రాజెక్టులన్నింటిని పెద్దపీట వేశారు.
♦ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక తెలుగుగంగలో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. ఇక తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ మట్టికట్టకూ సీఎం జగన్ డయాఫ్రమ్ వాల్ నిర్మించి లీకేజీలకు అడ్డకట్ట వేయడం ద్వారా ఆ ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు 17 టీఎంసీలు నిల్వచేస్తున్నారు. అలాగే, గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌నూ పూర్తిచేశారు. అంతేకాక.. రూ.950 కోట్లు వెచ్చిం చి గండికోట, రూ.280 కోట్లు వెచ్చిం చి సీబీఆర్ నిర్వాసితులకు పునరావాసం కలి్పంచి.. ఆ రెండు ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో అంటే గండికోటలో 26.85 టీఎంసీలు, సీబీఆర్‌లో పది టీఎంసీలు నిల్వచేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. ఇలా సీమ పచ్చబడుతుంటే ఎందుకంత కడపుమంట రామోజీ?
♦ఇక రాయలసీమ సాగు, తాగునీటి కష్టాలు కడతేర్చాలనే లక్ష్యంతో రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. దీనిపై ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవునిలా చంద్రబాబు అడ్డుపడుతుంటే ఏనాడైనా నిలదీశారా రామోజీ?
శరవేగంగా పారిశ్రామిక ప్రగతి..
నిజానికి.. నాలుగేళ్లలో రాయలసీమ పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధించింది. రవాణా, విద్యుత్ ఎల్రక్టానిక్స్, ఉక్కు రంగాల్లో శరవేగంగా ముందుకు సాగుతోంది. రాయలసీమ ప్రగతికి ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టు చుక్కానిలా నిలవనుంది. సీమలో ఉత్పత్తయ్యే వస్తువుల రవాణాకు.. ఎగుమతి, దిగుమతులు ఊపందుకోవడానికి ఈ పోర్టు ఉపయోగపడుతుంది. దీనిని రూ.2,365 కోట్లతో ప్రభుత్వం నిరి్మస్తోంది. ఈ పోర్టుకు సమీపంలోనే నాలుగైదు వేల ఎకరాల్లో పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి కానుంది. ఏడాదికి 34 మిలియన్ టన్నుల సరుకులు ఈ పోర్టు నుంచి ఎగుమతి, దిగుమతులు జరగనున్నాయి.
♦ కడప స్టీల్ ప్లాంట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
♦ 2019–23 మధ్యకాలంలో రాయలసీమ ప్రాంతంలో 71 అతిపెద్ద–భారీ పరిశ్రమలు వచ్చాయి. రూ.36,610 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 55 వేల మందికి ఉద్యోగాలు లభించాయి.
♦ రాయలసీమ ప్రాంతం దేశంలోనే సంప్రదాయేతర ఇంధన వనరుల రంగానికి తలమానికం కానుంది. ప్రభుత్వ కృషివల్ల ఈ ఒక్క రంగంలోనే.. అదీ ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 16 ప్రాజెక్టులు రాబోతున్నాయి.
♦ శ్రీకాళహస్తి సమీపంలోని ఇంగలూరులో అడిడాస్ షూ తయారీ కంపెనీ అపాచీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ఒక్క కార్యక్రమంతోనే ప్రారంభించిన, భూమి పూజ చేసుకున్న పరిశ్రమల పెట్టుబడుల విలువ దాదాపు రూ.4వేల కోట్లు కాగా.. సుమారు 20వేల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి.
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు..
రాయలసీమలో వైద్యారోగ్య పరంగా కూడా ఈ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిం ది. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తుండగా అందులో ఐదు కాలేజీల నిర్మాణాన్ని రాయలసీమలో చేపట్టింది. ఒక్కో మెడికల్ కాలేజీ కోసం సుమారుగా రూ.500 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తూ ప్రజారోగ్య రంగంలో పెట్టుబడి పెడుతోంది. రాయలసీమ చరిత్రలోనే ఇంత పెట్టుబడి ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు. ఇక తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర, కడప, అనంతపురం, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల రూపురేఖలను సైతం మారుస్తోంది. ప్రజారోగ్యంపై టీడీపీ సర్కార్ ఎప్పుడైనా ఇంత శ్రద్ధ పెట్టిందా రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment