అప్‌డేట్స్
01:08PM
రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ గర్జనకు విశేషమైన ప్రజా స్పందన లభించింది. దీనికి రాయలసీమ వాసులు భారీగా తరలివచ్చారు. విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు రాయలసీమ గర్జన సభలో పాల్గొన్నారు.
12:00PM
- చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదు: గుమ్మనూరు జయరాం
- మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: గుమ్మనూరు జయరాం
- మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం జగన్ ముందకెళ్తున్నారు: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా
- ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా
11:48AM
- రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు: ఎమ్మెల్సీ ఇక్బాల్
- చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయరాజధాని: ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి
- న్యాయ రాజధాని కోసం ఎంతకైనా పోరాడతాం
11:52AM
- రాజధాని అడిగే హక్కు రాయలసీమ వాసులకు ఉంది: బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి
- శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి రైతులకు ఎంతో త్యాగం చేశారు
- రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారు
- అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమ అభివృద్ధి చేయాలి
11:20AM
నారాసుర భూతం దిష్టిబొమ్మను దగ్థం చేసిన సీమజనం
రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు
10:30AM
మంత్రి బుగ్గన కామెంట్స్
- వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి
- వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన
- చంద్రబాబు కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారు
- కుప్పాన్ని అన్ని విధాల సీఎం జగన్ అభివృద్ధి చేశారు
- చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ.. మా దృష్టిలో రత్నాల సీమ
- రియల్టర్లపైనే చంద్రబాబుకు ప్రేమ
- రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు
- హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదు
మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్
- వికేంద్రకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం
- అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం
- చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదు
- స్వప్రయోజనాలకోసమే చంద్రబాబు ఆరాటం
- రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు: మంత్రి ఉషశ్రీ చరణ్
- వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుంది: మంత్రి ఉషశ్రీ చరణ్
- చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే శ్రీదేవి
- చంద్రబాబులాంటి ప్రతిపక్షనేతలు ఉండటం దురదృష్టకరం: ఎమ్మెల్యే శ్రీదేవి
- వికెంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: ఎమ్మెల్యే శ్రీదేవి
10:00AM
- కర్నూలులో ప్రారంభమైన జేఏసీ రాయలసీమ గర్జన సభ
- కర్నూలు న్యాయ రాజధాని కోసం గళం విప్పిన సీమ వాసులు
- రాయలసీమ జిల్లాల నుంచి సభాస్థలికి భారీగా తరలివచ్చిన జనం
- శ్రీబాగ్ ఒప్పంద ప్రాకరం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్
- సభా స్థలికి చేరుకున్న ప్రజాప్రతినిధులు, మేధావులు
- రాయలసీమ గర్జన సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్‌సీపీ నేతలు
- గర్జనకు హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్
- సభకు హాజరైన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్
‘మా నినాదం ఒక్కటే.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడమే’ అంటూ సీమ వాసులు కదం తొక్కారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ‘సీమ’ జిల్లాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా కర్నూలు వేదికగా నేడు గర్జించనున్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి..
కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో జరిగే ఈ సభకు అన్ని ఏర్పాట్లను జేఏసీ, వైఎస్సార్‌సీపీ నేతలు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వారం రోజులుగా దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు ‘గ్రేటర్ రాయలసీమ’లోని ఉమ్మడి ఆరు జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎన్జీవోలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు, ఆటో డ్రైవర్లు.. చివరకు తోపుడు బండ్లు, పాల వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి గళం విప్పేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment