Judicial Capital
-
దద్దరిల్లిన సీమ గర్జన.. గ్రాండ్ సక్సెస్.. భారీగా తరలివచ్చిన రాయలసీమ వాసులు
సాక్షి, కర్నూలు: రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న అన్యాయంపై రాయలసీమ వాసులు గళమెత్తారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు భారీగా రాయలసీమ వాసులు తరలివచ్చారు. దీంతో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ అయ్యింది. గర్జనకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు హాజరయ్యారు. న్యాయ రాజధానిపై జనం నినదించారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు, న్యాయ రాజధాని ఏర్పాటుకు డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. నారాసుర భూతం దిష్టిబొమ్మను సీమ జనం దగ్ధం చేశారు. రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. సభకు మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే నినాదంతో ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ గర్జనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సభకు కర్నూలుతో పాటు నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు ఆరాటం: మంత్రి పెద్దిరెడ్డి వికేంద్రీకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదని, స్వప్రయోజనాల కోసమే ఆయన ఆరాటం అని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదు: మంత్రి బుగ్గన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన అన్నారు. చంద్రబాబు కుప్పంలో అభివృద్ధి చేయలేకపోయారు. కుప్పాన్ని అన్ని విధాల సీఎం జగన్ అభివృద్ధి చేశారు. చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ.. మా దృష్టిలో రత్నాల సీమ. రియల్టర్లపైనే చంద్రబాబుకు ప్రేమ. రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు. హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదని, మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. -
న్యాయ రాజధాని కోసం కదం తొక్కిన సీమ వాసులు
అప్డేట్స్ 01:08PM రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ గర్జనకు విశేషమైన ప్రజా స్పందన లభించింది. దీనికి రాయలసీమ వాసులు భారీగా తరలివచ్చారు. విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు రాయలసీమ గర్జన సభలో పాల్గొన్నారు. 12:00PM చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదు: గుమ్మనూరు జయరాం మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: గుమ్మనూరు జయరాం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం జగన్ ముందకెళ్తున్నారు: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా 11:48AM రాష్ట్రాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు: ఎమ్మెల్సీ ఇక్బాల్ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వికేంద్రీకరణలో భాగంగానే కర్నూలులో న్యాయరాజధాని: ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి న్యాయ రాజధాని కోసం ఎంతకైనా పోరాడతాం 11:52AM రాజధాని అడిగే హక్కు రాయలసీమ వాసులకు ఉంది: బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి రైతులకు ఎంతో త్యాగం చేశారు రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారు అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమ అభివృద్ధి చేయాలి 11:20AM నారాసుర భూతం దిష్టిబొమ్మను దగ్థం చేసిన సీమజనం రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు 10:30AM మంత్రి బుగ్గన కామెంట్స్ వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఈ రాయలసీమ గర్జన చంద్రబాబు కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారు కుప్పాన్ని అన్ని విధాల సీఎం జగన్ అభివృద్ధి చేశారు చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ.. మా దృష్టిలో రత్నాల సీమ రియల్టర్లపైనే చంద్రబాబుకు ప్రేమ రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు హైకోర్టు సాధించే వరకూ పోరాటం ఆగదు మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్ వికేంద్రకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదు స్వప్రయోజనాలకోసమే చంద్రబాబు ఆరాటం రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు: మంత్రి ఉషశ్రీ చరణ్ వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుంది: మంత్రి ఉషశ్రీ చరణ్ చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే శ్రీదేవి చంద్రబాబులాంటి ప్రతిపక్షనేతలు ఉండటం దురదృష్టకరం: ఎమ్మెల్యే శ్రీదేవి వికెంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: ఎమ్మెల్యే శ్రీదేవి 10:00AM కర్నూలులో ప్రారంభమైన జేఏసీ రాయలసీమ గర్జన సభ కర్నూలు న్యాయ రాజధాని కోసం గళం విప్పిన సీమ వాసులు రాయలసీమ జిల్లాల నుంచి సభాస్థలికి భారీగా తరలివచ్చిన జనం శ్రీబాగ్ ఒప్పంద ప్రాకరం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ సభా స్థలికి చేరుకున్న ప్రజాప్రతినిధులు, మేధావులు రాయలసీమ గర్జన సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నేతలు గర్జనకు హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్ సభకు హాజరైన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ ‘మా నినాదం ఒక్కటే.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడమే’ అంటూ సీమ వాసులు కదం తొక్కారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ‘సీమ’ జిల్లాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా కర్నూలు వేదికగా నేడు గర్జించనున్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి.. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో జరిగే ఈ సభకు అన్ని ఏర్పాట్లను జేఏసీ, వైఎస్సార్సీపీ నేతలు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వారం రోజులుగా దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు ‘గ్రేటర్ రాయలసీమ’లోని ఉమ్మడి ఆరు జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎన్జీవోలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు, ఆటో డ్రైవర్లు.. చివరకు తోపుడు బండ్లు, పాల వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. -
‘న్యాయ రాజధాని’ మా హక్కు
సాక్షి ప్రతినిధి, కర్నూలు/కర్నూలు (రాజ్‌విహార్) : అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ‘సీమ’ జిల్లాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా కర్నూలు వేదికగా నేడు గర్జించనున్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీ.. హైకోర్టు ఏర్పాటుకు అడ్డు తగులుతూనే ఉంది. దీనిపై కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంద రోజులకుపైగా రిలే దీక్షలు చేశారు. రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు, మానవ హారాలు చేశారు. వెనుకబడిన ప్రాంతానికి న్యాయం దక్కుతుందని ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారు. ఇదే క్రమంలో ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు కూడా తమ ఆకాంక్షను నిరసన రూపంలో తెలియజేశారు. అయితే కర్నూలు వేదికగా చంద్రబాబు సీమ ప్రజల ఆకాంక్షలకు గండికొట్టేలా, కర్నూలులో హైకోర్టు అవసరం లేదని, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని అంటూ.. టీడీపీ కార్యకర్తలతోనూ అదే విధంగా నినాదాలు చేయించి సీమ ప్రజలను మరింత రెచ్చగొట్టారు. ఈ క్రమంలో ‘సీమ వాణి’ మరింత గట్టిగా వినిపించేందుకు జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సభాప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మంత్రి బుగ్గన ఉమ్మడి ఆరు జిల్లాల నుంచి.. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో జరిగే ఈ సభకు అన్ని ఏర్పాట్లను జేఏసీ, వైఎస్సార్సీపీ నేతలు పూర్తి చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి వారం రోజులుగా దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు ‘గ్రేటర్ రాయలసీమ’లోని ఉమ్మడి ఆరు జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలిరానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సభకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎన్జీవోలు, స్వర్ణకారులు, వస్త్ర వ్యాపారులు, ఆటో డ్రైవర్లు.. చివరకు తోపుడు బండ్లు, పాల వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. మొదటగా లక్ష మందితో సభ నిర్వహించాలని భావించినా, నిఘా వర్గాలు, నిర్వాహకుల లెక్క ప్రకారం అంతకు మించి భారీగా ప్రజలు తరలి రానున్నారని తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు, వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ‘న్యాయ రాజధాని’ ప్రకటనతో వేగంగా అభివృద్ధి హైకోర్టు ఏర్పాటైతే నాలుగు జిరాక్స్ మిషన్లు మినహా ఏం ఉపయోగం లేదని కొంత మంది హేళన చేస్తున్నారు. రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద నగరం, సౌత్ ఇండియాకు ముఖ ద్వారం కర్నూలు. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తే సాధారణ నగరాల కంటే భిన్నమైన అభివృద్ధి జరుగుతుంది. బెంగళూరు–హైదరా>బాద్, చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల పరిధిలో కర్నూలు ఉంది. ఇప్పటికే పారిశ్రామికంగా కర్నూలు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ అయితే పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా కర్నూలును ఎంచుకునే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు, భూమి, నీటి లభ్యత హైదరాబాద్ కంటే మరింత మేలుగా ఉండే అవకాశం ఉంది. రోడ్డు, రైలు మార్గాలతో పాటు విమానాశ్రయం కూడా ఉంది. దీంతో ప్రధాన నగరాలకు రవాణా సౌకర్యం కూడా మెరుగ్గా ఉంటుంది. హైకోర్టు ఏర్పాటైతే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌తో పాటు 43కు పైగా ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏసీబీ కోర్టు కర్నూలులో ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటుతో నగరంలో నిర్మాణ రంగం వేగం పుంజుకోనుంది. నగర పరిధి విస్తరించనుంది. దీంతో ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగు పడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 1953లో రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలును 1956లో త్యాగం చేయకుండా ఉండి ఉంటే ‘సీమ’ జిల్లాల ముఖచిత్రం మరోలా ఉండేది. త్యాగం చేయడంతో కర్నూలుతో పాటు సమీప జిల్లాలైనా అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు కూడా భారీగా నష్టపోయాయి. అందుకే ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో ‘న్యాయ రాజధాని’ సాధించాలని ‘సీమ’ వాసులు గట్టిగా సంకల్పించారు. ఆ దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. కాగా, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్, తదితరులు మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. వెనుకబడిన ప్రాంతానికి న్యాయం జరగాలి ‘సీమ’ అత్యంత వెనుకబడిన ప్రాంతం. దీనికి న్యాయం చేసేందుకు హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్దమనుషులు 1937లో ఒప్పందం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కాంక్షిస్తూ ముఖ్యమంత్రి హైకోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ కొందరు కుట్రలు చేస్తున్నారు. అది ఎవరో అందరికీ తెలుసు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అందుకే జేఏసీ నేతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. సభలో పాల్గొంటున్నాం. కచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలి. – బుగ్గన, ఆర్థిక శాఖ మంత్రి హైకోర్టు ఏర్పాటు చేసే వరకూ ఉద్యమిస్తాం కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. కానీ కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. ఇటీవల జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. పుండుపై కారం చల్లేలా ఆయన మాట్లాడారు. అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని, కర్నూలుకు హైకోర్టు అవసరం లేదని ఆయన టీడీపీ కార్యకర్తలతో నినాదాలు చేయించారు. అందుకే ‘సీమ గర్జన’తో ప్రజల ఆకాంక్షను నేడు తెలుపబోతున్నాం. – విజయ్‌కుమార్‌రెడ్డి, చైర్మన్, రాయలసీమ జేఏసీ స్వార్థ ప్రయోజనాల కోసమే బాబు కుట్రలు స్వార్థ ప్రయోజనాల కోసం కుట్రలు పన్నుతున్న ఏకైక వ్యక్తి టీడీపీ నేత చంద్రబాబు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో సీఎం జగన్మోహన్రెడ్డి ముందుకు వెళ్తున్నారు. కానీ అభివృద్ధి అంతా ఒకే చోట ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అమరావతి చుట్టూ చంద్రబాబు అనుచరులందరికీ భూములు ఉన్నందున, వారికి నష్టం జరగకూడదని చూస్తున్నారు తప్ప ఇతర ఆలోచన లేదు. తన రియల్ దందా దెబ్బ తింటుందనే ఆవేదనతోనే కుట్రలకు తెర లేపారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబుకు సీమ నెత్తురు ఉంటే కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేలా మద్దతు ప్రకటించాలి. – గుమ్మనూరు జయరాం, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చంద్రబాబు అడ్డంకులు తాత్కాలికమే వేల ఎకరాల పచ్చని పొలాలను రాజధాని పేరుతో తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఎడారిగా మార్చేసింది. అక్కడ అభివృద్ధి కోసం అంటూ రూ.వేల కోట్లు ఖర్చు చేసినా కనీసం టీ హోటల్ కూడా లేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతల అభివృద్ధి కోసం సీఎం జగన్ వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు లాంటి వాళ్లు ఎంత మంది అడ్డుకున్నా అవి తాత్కాలికమే. రాయలసీమ గర్జనకు మా పూర్తి సహకారం ఉంటుంది. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్, రాయచోటి ఎమ్మెల్యే -
న్యాయ రాజధాని సీమ హక్కు
కర్నూలు (రాజ్‌విహార్): న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలన్నది రాయలసీమ హక్కు. ఆ హోదా కర్నూలుకు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. డిసెంబరు 5వ తేదీన కర్నూలులో జరిగే రాయలసీమ గర్జన కార్యక్రమం జయప్రదంపై ఆయన బుధవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ప్రైవేటు కళాశాలలు, విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు, ముఖ్య నాయకులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు మద్రాసు, ఆ తరువాత హైదరాబాదు నుంచి విడిపోవడం, విభజన హామీలు పక్కాగా అమలు కాకపోవడంతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. 2014లో రాష్ట్ర విభజన అయ్యాక అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సీమకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధికార వికేంద్రీకరణకు సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. కర్నూలు నుంచి రాజధాని హైదరాబాదుకు తరిలించే సమయంలో పెద్దల సమక్షంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీమకు అన్యాయం జరగకుండా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, దీనిని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. గతంలో జరిగిన నష్టాన్ని భవిష్యత్తులో జరగరాదనే గొప్ప ఆలోచనతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు చేపట్టిన గర్జన విజయవంతం అయిందని, కర్నూలుకు హైకోర్టును సాధించుకునేందుకు ప్రతి వర్గం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలులో జరిగే రాయలసీమ గర్జన జయప్రదం కావాలని, గర్జనతో ఆగకుండా ఇక్కడ న్యాయ రాజధాని ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభమయ్యే వరకు విశ్రమించరాదని సూచించారు. హైకోర్టు కోసం చేసే ప్రతి ఉద్యమం, ఆందోళనకు ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లోనూ చైతన్యం వచ్చిందని, అయితే సమన్వయంతో కలుపుకొని వెళ్లాలని సూచించారు. విద్యార్థి, న్యాయవాదులు, ఉద్యోగ, కార్మిక, వ్యాపార సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ తరలివచ్చేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల ఎంపీలు డాక్టర్ సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎంఎ హఫీజ్‌ఖాన్, డాక్టర్ సుధాకర్, జేఏసీ కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, విద్యా సంస్థల నిర్వహకులు, జేఏసీ నాయకులు రాయలసీమ క్రిష్టియన్ కళాశాల కరస్పాండెంట్ ఆదిమూలపు సతీష్, కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి, రవీంద్ర కళాశాలల కరస్పాండెంట్ జి.పుల్లయ్య, జి.సుబ్బయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరాశాంతి, ఆదర్శ విద్యా సంస్థల కరస్పాండెంట్ తిమ్మయ్య, శ్రీచైతన్య విద్యా సంస్థల ఏజేఎంలు మురళీకృష్ణ, సురేష్, సెయింట్ జోసెఫ్ కరస్పాండెంట్ అనూప్, శ్రీలక్ష్మీ విద్యా సంస్థల కరస్పాండెంట్ మాధవీలత, వల్లపురెడ్డి జనార్ధన్‌రెడ్డి, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.